విడుదలకు సిద్ధమైన "ఝాన్సీ ఐపీఎస్"

"ప్రేమ" పోలీస్ ఆఫీసర్‌గా నటించిన "ఝాన్సీ ఐపీఎస్" అనే కన్నడ చిత్రాన్ని తెలుగులో సర్వసాయి ఫిలింస్ బైనర్‌పై అనువదిస్తున్నారు. ఈ చిత్రానికి సాయిరత్నం నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. సినిమాను ఈ నెలాఖరున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Source: వినోదం | 23 Jul 2008 | 12:31 pm

సింహాచలంలో "చింతకాయల రవి"

విక్టరీ వెంకటేష్, అనుష్క, ఛార్మీ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "చింతకాయల రవి". ప్రస్తుతం ఈ సినిమా సింహాచలం నరసింహస్వామి ఆలయంలో...
Source: వినోదం | 23 Jul 2008 | 12:15 pm

ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు "రెయిన్‌ బో"

"హ్యాపీడేస్" ఫేమ్ రాహుల్, సోనాలి చౌహాన్ హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం "రెయిన్‌ బో". ఈ సినిమా ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుందని చిత్ర దర్శకుడు, నిర్మాత వి.ఎన్. ఆదిత్య తెలిపారు. ఈ సినిమాను భారీ అంచనాలతో యూనిట్ కృషితో...
Source: వినోదం | 23 Jul 2008 | 12:05 pm

మార్కెట్‌లో లాభాలు: 838 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

మార్కెట్ బుధవారం అత్యధికంగా 14,980 పాయింట్లకు చేరుకుని, సాయంత్రం నాలుగు గంటల సమయానికి 838 పాయింట్ల లాభంతో 14,942 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నిఫ్టీ కూడా 237 పాయింట్ల లాభంతో 4,477 వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:40 am

రాజీనామాపై ఇప్పటికి ఆలోచించ లేదు: సోమనాథ్

తాజాగా సీపీఎంలో నెలకొన్న పరిస్థితులలో తాను లోక్‌సభ పదవి రాజీనామా చేసే అంశంపై తాను ఇంతవరకూ ఎటువంటి ఆలోచన చేయలేదని లోక్‌సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:29 am

అణు వివాదంపై మా వైఖరి మారదు: అహ్మదీనెజాద్

వివాదాస్పద అణు కార్యక్రమం విషయంలో తమ దేశ వైఖరి మారబోదని ఇరాన్ అధ్యక్షుడు అహ్మదీనెజాద్ పునరుద్ఘాటించారు. ఇరాన్ అణు కార్యక్రమంపై అగ్రరాజ్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇరాన్ ఈ అణు కార్యక్రమాన్ని
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:28 am

పొత్తులతో ప్రభుత్వం అంటే బలం తగ్గినట్లే: కాసాని

పొత్తులతో కేంద్రంలో ప్రభుత్వాన్ని నడపడం అంటే బలం తగ్గినట్లే కదా అని మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. 40 సంవత్సరాల పాటు పాలించిన కాంగ్రెస్ పొత్తులతో నడవడం ఏంటని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:18 am

ఎంపీలపై చర్యలు తీసుకుంటాం: ఎర్రన్నాయుడు

తెలుగుదేశం పార్టీని ఎంపీలు నమ్మశక్యంకాని రీతిలో దగా చేశారని ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ ఎర్రన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీకి చెందిన మంద జగన్నాథం (నాగర్‌కర్నూల్), ఆదికేశవులునాయుడు మంగళవారం జరిగిన విశ్వాసపరీక్షలో
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:15 am

8 మంది ఎంపీలపై బహిష్కరణ వేటు: భాజపా

భారతీయ జనతా పార్టీ అధిష్టానం కొరఢా ఝుళిపించింది. యూపీఏకు మద్దతు తెలిపిన ఎంపీలపై వేటు వేసింది. వీరిని పార్టీ నుంచి బహిష్కరించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధినేత రాజ్‌నాథ్ సింగ్ బుధవారం తెలిపారు. అలాగే నగదు ఎర చూపినా లొంగని ముగ్గురు ఎంపీలను అభినందించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 11:10 am

క్రాసింగ్ ఎఫెక్ట్: 8 మందిపై బీజేపీ వేటు

యూపీఏకు అనుకూలంగా ఓటు చేసిన 8 మంది భారతీయ జనతా పార్టీ సభ్యులపై ఆ పార్టీ అధిష్టానం వేటు వేసింది. వారిని ఏకంగా పార్టీ నుంచి బహిష్కరించింది. బుధవారం ఆ పార్టీ అధినేత రాజ్‌నాథ్ సింగ్ పాత్రికేయులకు వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:04 am

గ్రూప్-1 మెయిన్స్ యధాతథంగా జరుగుతాయి: ఏపీపీఎస్సీ

గ్రూప్-1 మెయిన్స్ యధాతథంగా జరుగుతాయని, వాటిని ఆపే ప్రసక్తి లేదని ఎపీపీఎస్సీ స్పష్టం చేసింది. ముందే ప్రకటించిన విధంగా ఆగస్ట్ 7న మెయిన్స్ జరుగుతాయని కమిషన్ వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 11:03 am

భాజపా ఎంపీలపై సభా హక్కుల తీర్మానం: ఎస్పీ

లంచం ఇవ్వజూపారని ఆరోపణలు చేసిన ముగ్గురు భారతీయ జనతా పార్టీ ఎంపీలపై సమాజ్‌వాది పార్టీ సభా హక్కుల తీర్మానం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు ఆ పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు ఎస్పీకి చెందిన ఎంపీ మోహన్ సింగ్ బుధవారం తెలిపారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 11:00 am

యుపిఏకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు: బాబు

యుపిఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు టీడీపీ చీఫ్ చంద్రబాబు ప్రకటించారు. యుపిఏ నేతల ద్వంద వైఖరిని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే తమ లక్ష్యమని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 10:57 am

పార్టీకే ద్రోహం చేస్తారా? చర్యలు తప్పవు..!

పార్టీ ఇచ్చే పదవులను అనుభవిస్తూ చివరి వరకు పార్టీలోనే ఉంటూ అకస్మాత్తుగా ద్రోహం చేయడం సబబు కాదని, వీరిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం ఖాయమని తెదేపా సీనియర్ నేత ఎంపీ ఎర్రన్నాయుడు అన్నారు. యూపీఏకు అనుకూలంగా తమ పార్టీ ఎంపీలు ఓటు వేయడం మహాద్రోహమని పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 10:50 am

దిల్‌సుఖ్‌నగర్ డిపోలో అగ్నిప్రమాదం: మూడు బస్సులు దగ్దం

దిల్‌సుఖ్‌నగర్ బస్ డిపోలో బుధవారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో మూడు బస్సులు అగ్నికి దగ్దమయ్యాయి. అక్కడ ఉన్న మెకానిక్ షెడ్‌లో బస్సుల మరమ్మతులు చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని...
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 10:44 am

సోమనాథ్‌పై చర్యలకు రంగం సిద్ధం..?

అందరికీ వామపక్షాలు కొరకరాని కొయ్య అనే విషయం అందరికీ తెలిసిందే. అందులోనూ సీపీఎం అంటే మరీ చెప్పాల్సిన పనే లేదు. అయితే అలాంటి సీపీఎం పార్టీకే ఓ వ్యక్తి కొరకరాని కొయ్యగా తయారయ్యారు
Source: Yahoo! Telugu: News | 23 Jul 2008 | 10:39 am

బలం తగ్గినట్లేనని కాంగ్రెస్ ఒప్పుకోవాల్సిందే!

దాదాపు 40 సంవత్సరాలుగా ఏకధాటిగా పాలన సాగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రస్తుతం కేంద్రంలో పొత్తులతో నడవడం ఆ పార్టీకి బలం తగ్గినట్లేనని, కాంగ్రెస్ నాయకులు దీన్ని ఒప్పుకుని తీరాల్సిందేనని, మన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 10:09 am

ప్రభాస్ చిత్రానికి జయంత్ దర్శకత్వం!

యువ హీరో ప్రభాస్ నటించే "రాజు" అనే కొత్త చిత్రానికి జయంత్ పరంజి దర్శకత్వం వహిస్తున్నారు. కృష్ణం రాజు నిర్మాత సారథ్యం వహిస్తున్న ఈ సినిమా...
Source: వినోదం | 23 Jul 2008 | 9:51 am

గ్రూప్-1 పరీక్షల్లో రిజర్వేషన్ తప్పనిసరి : హైకోర్టు

గ్రూప్-1 పరీక్షల్లో అభ్యర్ధులను ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కు ఎంపిక చేసే సమయంలో రిజర్వేషన్లను ఖచ్చితంగా పాటించితీరాలని హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ సందర్భంగా కోర్టు ప్రభుత్వం చేసిన జీవో నెం 570ను తప్పుబట్టింది.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 9:43 am

భాజపా ఎంపీలకు షోకాజ్ నోటీసులు

విశ్వాస పరీక్ష సమయంలో సభకు గైర్హాజరైన ఎంపీలకు భారతీయ జనతా పార్టీ అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేయనుంది. అంతేకాకుండా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఎంపీలపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ప్రకటించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 9:01 am

యూపీఏకు వ్యతిరేకంగా 'మహా' ఆందోళన

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఆందోళన చేపట్టనున్నట్టు వాపక్షాలు, యూఎన్‌పీఏ, బీఎస్పీ పార్టీలు ప్రకటించాయి. భారత్-అమెరికా అణు ఒప్పందం, ధరల పెరుగుదల, విశ్వాస పరీక్షలో అనైతిక విజయం తదితర అంశాలపై ఈ ఆందోళన సాగుతుందని ఆ పార్టీ నేతలు ప్రకటించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 8:39 am

కన్నడ చిత్రం ఝాన్సీ ఐపీఎస్‌లో ప్రేమ

ఝాన్సీ ఐపీఎస్ అనే కన్నడం చిత్రాన్ని తెలుగులోకి అదే పేరుతో డబ్బింగ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఝాన్సీగా ప్రేమ నటిస్తోంది. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ నెలాఖరు నాటికి విడుదల చేసేందుకు సన్నాహాలు
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2008 | 8:03 am

"మాయ"తో తృతీయ కూటమి నేతల భేటీ

యూపీ సీఎం, బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతితో విపక్షాల నేతలు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ భేటీలో యూఎన్‌పీఏ నేతలు, బీఎస్పీ నేతల్లో ప్రకాశ్ కారత్, బర్దన్, రాజా, చంద్రబాబు, కేసీఆర్, చౌతాలా, అజిత్ సింగ్ తదితరులు హాజరయ్యారు. మూడో కూటమి ఏర్పాటుపై, వీరి మధ్య చర్చలు జరుగనుందని సమాచారం.
Source: జాతీయ | 23 Jul 2008 | 7:48 am

మాఫియా కార్యకలాపాలతో అంకుశం

విజయ్‌కుమార్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం అంకుశం. కొంతమంది పోలీసుల అండదండలతో అమ్మాయిలతో వ్యాపారం సాగించే మాఫియా కార్యకలాపాలతో ఈ చిత్రం రూపొందుతోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2008 | 7:39 am

పంజాబ్‌లో సిక్కుల నిరసన

హర్యానాలోని సిర్సా జిల్లాలో జరిగిన ఘటనను నిరసిస్తూ పంజాబ్‌లో దమ్‌ దామీ తక్సల్ (భింద్రన్‌వాలా) సిక్కు కార్యకర్తలు వాహనాల రాకపోకలను బుధవారం అడ్డుకున్నారు. దమ్‌దామీ తక్సల్ అధినేత హర్నాం సింగ్ ధూమా పిలుపుమేరకు సిక్కులు ఈ నిరసనకు దిగారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 7:08 am

బీసీ బాలికలకు హాస్టళ్లు : ప్రభుత్వం

వెనుకబడిన కులాలు (బీసీ) బాలికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 300 హాస్టళ్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఇందుకోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ. 20 కోట్ల నిధులను కూడా కేటాయించింది.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 7:05 am

పదవుల కోసం కాదీ ప్రయత్నం : నాగబాబు

చిరంజీవి పార్టీలో ప్రవేశించే వారికి పదవులు ముఖ్యం కారాదని నాగబాబు పేర్కొన్నారు. తొలుత పార్టీని బలోపేతం చేసే దిశగా పార్టీలోని వారు కృషి చేయాలని ఆయన కోరారు. చిరంజీవి త్వరలోనే పార్టీ ఏర్పాటు చేస్తారని అయితే ఆ పార్టీలో చేరేవారికి పదవుల మీద కాకుండా ప్రజాసేవ మీదే కాంక్ష ఉండాలని...
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 6:50 am

కళ్లు తెరచిన ఉప్పలమ్మ అమ్మవారు!

రాష్ట్ర రాజధాని నగరంలోని బోలక్‌పూర్‌లో కొలువై ఉన్న ఉప్పలమ్మ అమ్మవారు విగ్రహం కన్ను తెరిచిందనే వార్తలు హైదరాబాద్‌లో సంచలనం సృష్టించింది. గురుపూర్ణిమను పురస్కరించుకుని షిరిడీ సాయినాథుడు కళ్లు తెరిచారన్న వార్తలు విన్న కొద్ది రోజుల్లోనే... మళ్లీ అమ్మవారు కళ్లు తెరిచారని వార్తలు వెలువెత్తుతున్నాయి.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 6:48 am

కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్న జగన్నాధుడు?

అణుఒప్పందంపై జరిగిన విశ్వాస పరీక్షలో యూపీఏకు సానుకూలంగా ఓటువేసిన తెలుగుదేశం పార్టీ ఎంపీ మందా జగన్నాధానికి రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానం అభ్యర్థిగా అవకాశం కల్పించనున్నట్లు విశ్వసనీయుల సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 6:37 am

జమ్మూ-కాశ్మీర్ రోడ్డు ప్రమాదం : 15మంది మృతి

జమ్మూ-కాశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో చోటుచేసుకున్న ఓ రోడ్డు ప్రమాదంలో 15మంది ప్రాణాలు కోల్పోగా, మరో 29మంది తీవ్రగాయాలకు గురైయ్యారు. బుధవారం ఉదయం కొండ నుంచి అదుపుతప్పి లోతైన లోయలో పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 6:17 am

కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఏక్ పోలీస్

నాగేంద్రబాబు హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వం వహించిన చిత్రం ఏక్ పోలీస్. ఈ చిత్ర షూటింగ్ మంగళవారంతో పూర్తి అయ్యింది. మాదాపూర్‌లో అల్యూమినియం ఫ్యాక్టరీలో సన్నివేశాల చిత్రీకరణతో చిత్రం పూర్తి అయ్యిందని...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2008 | 6:11 am

గాంధీభవన్‌ను సందర్శించనున్న రాహుల్!

ఏఐసీసీ కార్యదర్శి రాహుల్ గాంధీ ఈ నెల 27వ తేదీన గాంధీభవన్‌ను సందర్శించనున్నారు. నగర శివార్లలోని బాచుపల్లి వద్ద నేటి (జూలై 23) నుంచి ప్రారంభమౌతోన్న యువజన కాంగ్రెస్ జాతీయ సమావేశాలలో చివరి రెండు రోజులు రాహుల్ గాంధీ పాల్గొంటారు.
Source: ఏపీ న్యూస్ | 23 Jul 2008 | 4:58 am

సీపీఎం నుంచి సోమనాథ్‌ బహిష్కరణ..?

పార్టీ ఆదేశాలను బేఖాతరు చేసిన లోక్‌సభ స్పీకరు సోమనాథ్ ఛటర్జీపై సీపీఎం బహిష్కరణ వేటు వేయనుంది. ఇందుకోసం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో పావులు కదుపుతోంది. సోమనాథ్‌పై చర్య తీసుకునేందుకు ఆమోదం తెలుపాల్సిందిగా విజ్ఞప్తి చేసినట్టు పొలిట్‌బ్యూరో సభ్యుడు ఒకరు సూచన ప్రాయంగా వెల్లడించారు.
Source: జాతీయ | 23 Jul 2008 | 4:16 am

జులై 23, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2008 | 3:24 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 23 Jul 2008 | 2:50 am

పీఎంగా అద్వానీని అంగీకరిస్తారా..? - ప్రధాని ప్రశ్న

దేశ ప్రధానిగా ఎల్కే.అద్వానీ బాధ్యతలు చేపట్టడాన్ని వామపక్షాలు అంగీకరిస్తారా? అని ప్రధాని మన్మోహన్ సింగ్ సూటిగా ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ అగ్రనేత అద్వానీ తనను చేతగానీ ప్రధానిగా వర్ణించడం పట్ల ఆయన తీవ్రంగా మండిపడ్డారు.
Source: జాతీయ | 22 Jul 2008 | 3:24 pm

'విశ్వాసం'లో యూపీఏ ఘన విజయం

మన్మోహన్ చిరు నవ్వులు చిందించారు. యూపీఏ ప్రభుత్వం విజయం సాధించింది. యూపీఏ సంకీర్ణ పాలకులు ఆది నుంచి ప్రకటిస్తున్నట్టుగానే విజయాన్ని కైవసం చేసుకున్నారు. మంగళవారం జరిగిన ఓట్ల లెక్కింపులో ప్రభుత్వానికి అనుకూలంగా 275 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 256 ఓట్లు వచ్చాయి.
Source: జాతీయ | 22 Jul 2008 | 3:10 pm

గిరిజనులకూ హక్కులున్నాయ్!

ఏజెన్సీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించే హక్కు గిరిజనులకు ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున వెల్లడించారు. గిరిజన ప్రాంతంలో వారి మేలుకోసం చేసిన చట్టాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనేతరులు శత్రువులో కాబోరని, వారితో అనవసరంగా గొడవలో పడి కేసులో ఇరుక్కోవద్దని హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 12:20 pm

లోక్‌సభలో డబ్బు : విచారణకు బాబు డిమాండ్

విశ్వాస పరీక్షలో గెలవడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం డబ్బును ఎరవేయడం అత్యంత హేయమైన చర్య అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ జవాబు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 12:03 pm