గిరిజనులకూ హక్కులున్నాయ్!

ఏజెన్సీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవించే హక్కు గిరిజనులకు ఉందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున వెల్లడించారు. గిరిజన ప్రాంతంలో వారి మేలుకోసం చేసిన చట్టాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. గిరిజనేతరులు శత్రువులో కాబోరని, వారితో అనవసరంగా గొడవలో పడి కేసులో ఇరుక్కోవద్దని హితవు పలికారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 12:20 pm

లోక్‌సభలో డబ్బు : విచారణకు బాబు డిమాండ్

విశ్వాస పరీక్షలో గెలవడానికి కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం డబ్బును ఎరవేయడం అత్యంత హేయమైన చర్య అని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు పేర్కొన్నారు. ఈ విషయంపై ప్రధాని మన్మోహన్ జవాబు చెప్పాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 12:03 pm

సోనియా హామీతోనే యూపీఏకు ఓటు : నరేంద్ర

ప్రత్యేక తెలంగాణ పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ హామీ ఇవ్వడంతోనే యూపీఏకు ఓటు వేస్తున్నట్లు టీఆర్ఎస్ (ఎన్) అధినేత నరేంద్ర పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 11:49 am

చూడండి.... మేమెంతగా ప్రేమించుకుంటున్నామో...

ప్రేమకు హద్దులు లేవు.... ఇదీ ప్రేమికులు చెప్పే మాట. ఇది ప్రేమకా... లేదంటే వారి ప్రవర్తనకా... అంటే ప్రవర్తనకే అని చెప్పాల్సి వచ్చిన దుస్థితి. ఇదివరకటి రోజుల్లో ప్రేమికులు తమ ప్రేమ భావనలను కేవలం ప్రేమ లేఖల ద్వారా ఒకరికొకరు పంచుకునేవారు. ఒకవేళ వీరిద్దరూ ఎక్కడైనా...
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 11:26 am

బెంగుళూరు రేస్ కోర్స్‌కు స్థానచలనం: ప్రభుత్వ నిర్ణయం

బెంగుళూరు రేసు కోర్స్‌ను వేరొక చోటుకు మార్చాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నగరం నడిబొడ్డున ఉన్న ఈ రేస్ కోర్స్‌ను కొత్త ప్రదేశానికి మార్చనున్నామని కర్ణాటక ప్రజా పనుల శాఖ మంత్రి సీఎం ఉదేశీ మంగళవారం తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 11:24 am

మార్కెట్‌లో లాభాలు: 254 పాయింట్ల వృద్ధితో సెన్సెక్స్

మంగళవారం ఉదయం 12 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన మార్కెట్ క్రమంగా నష్టాల్లో కూరుకుపోయింది. అయినప్పటికీ, మధ్యాహ్న సమయానికి తిరిగి పుంజుకుని సాయంత్రం నాలుగు గంటల సమయానికి 254 పాయింట్ల లాభంతో 14104 వద్ద...
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 11:10 am

పోలేపల్లి సెజ్: పోరాటానికి ఎన్‌టీపీపీ సిద్ధం

మహబూబ్ నగర్ జిల్లా పోలేపల్లి సెజ్‌కు సంబంధించి బాధితుల వైపున ఉండి పోరాడాలని ఎన్‌టీపీపీ (నవ తెలంగాణ ప్రజా పార్టీ) నిర్ణయించింది. ఈ దిశగా ఈ నెల 24 నుంచి దేవేందర్ గౌడ్ ఉద్యమాన్ని చేపట్టనున్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 11:00 am

చైనాలో అద్భుతాలు ఆశించొద్దు: సురేష్ కల్మాడీ

బీజింగ్‌లో వచ్చే నెల 8న ప్రారంభం కాబోతున్న ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో భారత క్రీడాకారుల నుంచి అద్భుతాలు ఆశించవద్దని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు సురేష్ కల్మాడీ తెలిపారు. భారత క్రీడాభిమానాలకు చైనాలో అద్భుతాలను
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:57 am

అది ఆయన ఇష్టం: ఓటేస్తే చాలు

పదవికి రాజీనామా చేయలా... ? వద్దా...? అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. కీలక పరిస్థితి వస్తే ప్రభుత్వానికి ఓటేస్తే చాలు. లోక్‌సభ సభాపతి సోమనాథ్ ఛటర్జీ తీరుపై సీపీఎం పార్టీ తీసుకున్న నిర్ణయం ఇది. వృద్ధనేత సీపీఎం పార్టీని ఒక తిప్పు తిప్పారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:57 am

మెడికల్ కౌన్సెలింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి

డాక్టర్ ఎన్‌టిఆర్ విశ్వవిద్యాలయం పరిధిలోని ఎంబిబిఎస్, బిడిఎస్ కోర్సులకు సంబంధించిన తొలిదశ కౌన్సెలింగ్ రాష్ట్రంలోని 5 కేంద్రాల్లో బుధవారం ప్రారంభం కానుంది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:51 am

గిరిజన చట్టాల అమలు చేయాలి: ఎస్సీ కమిషన్ డిమాండ్

గిరిజనుల కోసం ప్రవేశపెట్టిన చట్టాలను అమలు చేయాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ నాగార్జున డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవనం సాగించే హక్కు వారికి ఉందని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:40 am

ఆసియా యూత్ చెస్‌లో భారత్‌కు పతకాల పంట

ఆసియా యూత్ చెస్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ పతకాల పంట పండించుకుంది. ఈ పోటీల్లో భారత్ ఆరు స్వర్ణ పతకాలతో పాటు మొత్తం 21 పతకాలు దక్కించుకుంది. ఎం మహాలక్ష్మి అండర్- 8 బాలిక విభాగంలో బంగారు పతకాన్ని
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:38 am

విశ్వాసపరీక్షపై నేడు ఎన్సీపీ నిర్ణయం

ఇది కీలక సమయం. ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని దింపడానికి ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మిత్రపక్షాలు మల్లగుల్లాలు పడుతున్నాయి. కొన్ని పార్టీలు తమ మద్దతు ప్రకటించక వారి గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:12 am

ఆరు మంది సభ్యులకు లీవ్ ప్రకిటించిన లోక్‌సభ

గత సభలకు హజరు కాకుండా ఉన్న ఆరుగురు సభ్యులకు లోక్‌సభ మంగళవారం 'లీవ్' ప్రకటించింది. ఇందులో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయ్ కూడా ఉన్నారు. కీలక సమయంలో ఇది యూపీఏకు లాభించగా, ఎన్‌డిఏకు నష్టం కలిగించనున్నది.
Source: Yahoo! Telugu: News | 22 Jul 2008 | 10:06 am

యూపీఏకు ఆదికేశవులు మద్దతు ?

యూపీఏ సర్కారు మంగళవారం సాయంత్రం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న నేపథ్యంలో పలుపార్టీల ఎంపీలు తమ ఓటును ఎటువైపు వేస్తారో తెలియని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ఎంపీలు సైతం తమ మద్దతు కాసేపు వీరికని, కాసేపు వారికని చెబుతూ ఉత్కంఠతకు గురిచేస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 7:12 am

మేఘ మథనానికి ఏర్పాట్లు : ప్రభుత్వం

రాష్ట్రంలో ఏర్పడిన వర్షాభావ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం మేఘ మథనం చేయడానికి నిర్ణయించింది. ఈ కార్యక్రమాన్ని మంగళవారం నుంచి ప్రారంభించడం కోసం ప్రభుత్వం సోమవారం ఓ జీవోను విడుదల చేసింది.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 7:00 am

విద్యుత్ రంగాన్ని విస్మరించిన వైఎస్సార్: బాబు

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నాలుగేళ్ళ పాలనలో విద్యుత్ రంగాన్ని పూర్తిగా విస్మరించారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దేశ రాజధానిలో ఉన్న ఆయన ఒక లేఖను మీడియాకు ...
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 6:03 am

యూపీఏ వైపు 'టైగర్' నరేంద్ర మొగ్గు...!

అణు సంక్షోభంలో చిక్కుకున్న యూపీఏ ప్రభుత్వాన్ని గట్టెక్కించేందుకు తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆలె నరేంద్ర తన వంతు చేయూత ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అదేసమయంలో ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం నుంచి సరైన హామీ పొందాలనే కృత నిశ్చయంతో ఉన్నారు.
Source: ఏపీ న్యూస్ | 22 Jul 2008 | 4:40 am

జులై 22, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలి షాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2008 | 4:05 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 22 Jul 2008 | 2:52 am

భాజపా ఆర్ధిక విధానాలు కొనసాగింపు : గురుదాస్

కేంద్రంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వం భాజపా ఆర్ధిక విధానాలను అమలుచేస్తుందని సీపీఐ సీనియర్ నేత గురుదాస్ దాస్‌గుప్తా ఆరోపించారు. ద్రవ్యోల్బణం అదుపు కంటే ఉన్నత వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఆవిరాళ కృషి జరుపుతుందని దుయ్యబట్టారు.
Source: జాతీయ | 21 Jul 2008 | 2:36 pm

విశ్వాస పరీక్ష ముగిసే వరకు బాబు ఢిల్లీలోనే!

లెఫ్ట్‌ మద్దతు ఉపసంహరణతో యూపీఏ ప్రభుత్వానికి ఈ నెల 22న విశ్వాస పరీక్ష జరుగనున్న నేఫథ్యంలో... విశ్వాస పరీక్ష ముగిసే వరకు తెదేపా అధినేత, యూఎన్‌పీఏ కన్వీనర్‌ చంద్రబాబు నాయుడు హస్తినలోనే ఉండాలని నిర్ణయించుకున్నారు.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 12:57 pm

'చిరు' శిబిరంలో ఏర్పాట్లు ముమ్మరం

మెగాస్టార్ రాజకీయ రంగ ప్రవేశంపై వస్తున్న ఊహాగానాలపై స్పష్టత ఏర్పడింది. పార్టీ ఏర్పాటుపై ఇప్పటి వరకు నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. పార్టీ ఏర్పాటు అనేకంగా ఆగస్టు 15 లేదా 22వ తేదీల్లో ప్రకటించే అవకాశాలు ఉన్నట్టు తొలుత వార్తలు వచ్చాయి.
Source: ఏపీ న్యూస్ | 21 Jul 2008 | 12:53 pm

అణువుపై చర్చలు ఆపండి : మాయావతి

అణు ఒప్పందంపై అమెరికాతో చర్చలను యూపీఏ నిలిపివేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి మాయవతి డిమాండ్ చేశారు. భారత-అమెరికాల అణు ఒప్పందం వ్యవహారాన్ని త్వరలో జరిగే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ప్రభుత్వానికి వదిలేయాలని మాయ అన్నారు.
Source: జాతీయ | 21 Jul 2008 | 12:49 pm

యూపీఏ-లెఫ్ట్‌ల మధ్య చిచ్చుపెట్టిన 'ఒప్పందం'

భారత్-అమెరికా పౌర అణు ఒప్పందం యూపీఏ-లెఫ్ట్ పార్టీల మైత్రీ బంధంలో చిచ్చు పెట్టిన విషయం తెల్సిందే. గతంలో దేశ అభివృద్ధి కోసం పలు ప్రభుత్వాలు వివిధ రకాల ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. అయితే ఏ ఒప్పందం కూడా అణు ఒప్పందంలా వివాదాస్పదం కాలేదు.
Source: జాతీయ | 21 Jul 2008 | 12:47 pm

ఆర్య సరసన సోనియా అగర్వాల్

తమిళంలో విజయం సాధించిన ఒరు కల్లూరియిన్ కదై తెలుగు రీమేక్‌ చిత్రంలో ఆర్య సరసన సోనీ అగర్వాల్ నటిస్తోంది. అనీష్ ఫిలింస్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి కాలేజీ డేస్‌గా పేరు పెట్టారు.
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 12:15 pm

వినోదాత్మకంగా జస్ట్ 5 మినిట్స్ చిత్రం

దత్తా క్రియేషన్స్ పతాకంపై ఎస్.గోపాల్, టి. ఆనంద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం జస్ట్ 5 మినిట్స్. ఈ చిత్రానికి నాగులకొండ నవకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్ర పాటల రికార్డింగ్ ఇటీవలె డి.ఎన్.ఆర్...
Source: Yahoo! Telugu: Entertainment | 21 Jul 2008 | 12:10 pm

సభలో అడుగు పెట్టిన అగతా సంగ్మా

దేశ పార్లమెంట్‌కు అతి చిన్న వయస్సులో ఎన్నికైన అగతా సంగ్మా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. లోక్‌సభ మాజీ స్పీకర్, కాంగ్రెస్ మాజీ నేత అయిన పీఏ.సంగ్మా కుమార్తె అయిన 27 ఏళ్ల అగతా సాంగ్మా ప్రస్తుత పార్లమెంట్‌లో అతి చిన్న వయస్సు కలిగిన సభ్యురాలు.
Source: జాతీయ | 21 Jul 2008 | 11:12 am