ఎన్డీయే కూటమిలోనూ అణు ప్రకంపనలు

యూపీఏ ప్రభుత్వాన్ని చుట్టిముట్టిన 'అణు' ప్రకంపనలు ఎన్డీయే కూటమిని సైతం తాకుతున్నాయి. ఈ కూటమిలోని శివసేన.. మద్దతుపై ఇప్పటి వరకు స్పష్టమైన హామీ ఇవ్వలేదు. దీంతో కమలనాథుల్లో ఆందోళన మొదలైంది.
Source: జాతీయ | 19 Jul 2008 | 1:11 pm

టీడీపీతో సై అంటే అధోగతే : దేవేందర్ గౌడ్

తెలుగుదేశంతో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్నా ఆ పార్టీ అధోగతి పాలవుతుందని నవ తెలంగాణ ప్రజా పార్టీ అధినేత దేవేందర్ గౌడ్ పేర్కొన్నారు. ప్రస్తుతం టీడీపీ అంటే స్పష్టమైన విధి విధానాలు లేని పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 12:20 pm

"మాయ"ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తాం: బాబు

యూఎన్‌పీఏ కూటమిలో యూపీ సీఎం, బీఎస్పీ అధినేత మాయావతి చేరితే ఆమెను ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మాయావతి భావి దేశ ప్రధాని కావచ్చునని బాబు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాలపై యూఎన్‌పీఏ కూటమి సమావేశాల్లో నిర్ణయిస్తామని వివరించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 12:19 pm

బీఎస్పీలో ఎస్పీ ప్రధానకార్యదర్శి షాహిద్ సిద్దిఖి

సమాజ్ వాదీ పార్టీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు షాహిద్ సిద్దిఖి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే బహుజన్ సమాజ్‌పార్టీలో చేరనున్నానని ప్రకటించారు. న్యూఢిల్లీలో యూపీ ముఖ్యమంత్రి మాయావతితో సమావేశమైన తర్వాత ఆమె పక్కనే విలేకరులతో...
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 11:55 am

తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు

తొలి విడత మెడికల్ కౌన్సెలింగ్ ఈ నెల 23 నుంచి నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. 2008- 2009 విద్యాసంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్/బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశించేందుకు ఈ కౌన్సెలింగ్...
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 11:42 am

విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని రాజీనామా చేయరు

విశ్వాస పరీక్షకు ముందే ప్రధాని పదవికి మన్మోహన్ సింగ్ రాజీనామా చేస్తారన్న వార్తలను కాంగ్రెస్ శనివారం తోసిపుచ్చింది. బలపరీక్షలో గెలుపు తథ్యమన్న నమ్మకం తమకు ఉన్నందున ఈ ప్రశ్నకు అసలు చోటే లేదని ఆ పార్టీ పేర్కొంది.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 11:20 am

పెరుగుతున్న విద్యుత్ వినియోగం

రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రోజురోజుకు పెరిగిపోతోంది. దీంతో వినియోగానికి సరపడ విద్యుత్‌ను ఉత్పత్తి చేయలేక ఏపీ ట్రాన్స్‌కో సంస్థ చేతులెత్తేసింది. గత ఏడాది ఇదే రోజుకు 158 మిలియన్ యూనిట్ల మేరకు విద్యుత్ వినియోగం ఉండగా, ప్రస్తుతం ఇది 170 మిలియన్ యూనియట్లకు చేరుకుంది.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 11:18 am

తెరాస బంద్‌ : స్తంభించిన జనజీవనం

తెలంగాణ రాష్ట్ర సమితి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బంద్‌తో జనజీవనం స్తంభించింది. పలు జిల్లాల్లో తెరాస కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్‌లో బంద్ ప్రభావం తీవ్రంగా కన్పిస్తోందని పోలీసులు వెల్లడించారు. హనుమకొండకు చెందిన ఓ ఆర్టీసీ బస్సును తెరాస కార్యకర్తలు పెట్రోలు పోసి తగలబెట్టారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 11:14 am

కృష్ణా ప్రాజెక్ట్ రెండో దశకు మోక్షం

భాగ్యనగరవాసులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కృష్ణా ప్రజెక్ట్ రెండో దశ పథకం శనివారం ప్రారంభమైంది. కృష్ణా ప్రాజెక్ట్ రెండో దశ పథకాన్ని శనివారం కేంద్ర ఆర్ధికమంత్రి చిదంబరం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 11:13 am

రాష్ట్ర ప్రభుత్వంపై చిదంబరం ప్రశంసల వర్షం

రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పి. చిదంబరం ప్రశంసల వర్షం కురిపించారు. నిజాం గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన ఆరోగ్య శ్రీ బీమా పథక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం అద్భుతమని అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 10:57 am

సోనియాతో రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీల సమావేశం

కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శనివారం రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ వీరప్ప మొయిలీ ఎంపీలకు విందు ఇవ్వనున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా...
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:50 am

విద్యుత్ కోతకు నిరసనగా బీజేపీ ఆందోళన

నగరంలో విద్యుత్ కోత అధికంగా ఉందంటూ బీజేపీ శనివారం ఆందోళన కార్యక్రమం చేపట్టింది. ఇకపై విద్యుత్ కోత ఉండదంటూ మంత్రి షబ్బీర్ అలీ ప్రకటించిన విషయం తెలిసిందే.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:28 am

ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గం: వెంకయ్య

కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడిపోవడం ఖాయమని తెలిపిన బీజేపీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ఎన్నికలకు సిద్ధం కావడమే మార్గమని అన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:20 am

యూపీఏ సర్కారుకు 291 ఎంపీల మద్దతు: లాలు

యూపీఏ సర్కారుకు లోక్‌సభలో 291 మంది సభ్యుల మద్దతు ఉందని కేంద్ర రైల్వే మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ పేర్కొన్నారు. విశ్వాసపరీక్షలో ప్రభుత్వం తప్పక విజయం సాధిస్తుందన్నారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:19 am

ఎస్పీలో పెరుగుతున్న అసమ్మతి ఎంపీల బలం

యూపీఏ ప్రభుత్వానికి ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. విశ్వాస పరీక్షా ముహుర్తానికి మరో 72 గంటల సమయం మాత్రమే ఉంది. యూపీఏకు అండగా నిలుస్తామని ప్రకటించిన ఎస్పీ ఎంపీలు ఒక్కొక్కరు తిరుగుబాటు బావుటా ఎగుర వేస్తున్నారు.
Source: జాతీయ | 19 Jul 2008 | 10:18 am

మరో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ తిరుగుబాటు

యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలన్న పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ నిర్ణయాన్ని ఆ పార్టీకి చెందిన మరో ఎంపీ ధిక్కరించారు. లోక్‌సభలో విశ్వాసపరీక్షకు వ్యతిరేకంగా ఓటు వేయనున్నట్టు జాలేశ్వర్ ఎంపీ ఎస్పీ సింగ్ బఘేల్ ప్రకటించారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:05 am

సీపీఐకి తాడి శకుంతల గుడ్‌బై

సీపీఐకి రాజీనామా చేసినట్టు మాజీ మేయర్ తాడి శకుంతల శనివారం ప్రకటించారు. పార్టీ పదవులతో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 10:02 am

యూపీఏను ఓడిస్తాం! : వెంకయ్య

"అణుఒప్పందం" విషయంలో పురోగతి సాధించాలని ఇతర పార్టీల మద్దతును చేజార్చుకున్న యూపీఏ ప్రభుత్వాన్ని ఓడిస్తామని భాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడు ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 22న లోక్‌సభలో జరుగనున్న విశ్వాస పరీక్షల్లో యూపీఏను ఓడిస్తామని ఆయన పేర్కొన్నారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 9:26 am

పోరాడి ఓడిన ప్రకాష్: ఫైనల్లో భారత జంట

అమెరికాలోని ఆప్టోస్‌లో జరిగే 75వేల డాలర్ల ఏటీపీ ఛాలెంజర్ టోర్నమెంట్‌లో ప్రకాష్ అమృత్ రాజ్ పోరాడి ఓటమిపాలయ్యాడు. క్వార్టర్ ఫైనల్లో ఇటలీకి చెందిన స్టాపినీ 6-7, 7-5, 6-4తో ప్రకాష్ అమృత్ రాజ్‌పై విజయం సాధించాడు.
Source: Yahoo! Telugu: News | 19 Jul 2008 | 9:25 am

'అణు' ప్రకంపనలు : హస్తినలో బాబు బిజీ

అణు ఒప్పందం దేశ రాజకీయాల్లో భారీ ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో బిజీగా ఉన్నారు. అణు ఒప్పందానికి కట్టుబడి బలపరీక్షకు సిద్ధమైన యూపీఏ ప్రభుత్వ పతనానికి తనవంతు కృషిగా చంద్రబాబు ఢిల్లీ పయనం కావడం విశేషం.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 8:56 am

వైద్యమాఫియాపై "హరేరామ్"ల పోరాటం

"హరేరామ్" వినోదభరితమే అయినప్పటికీ.. సమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలను ఎత్తి చూపిస్తూ, వాటికి పరిష్కారాలను కూడా చెప్పే చిత్రాలు చాలా వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని తనదైన బాణీలో చూపించాలనే కళ్యాణ్‌ రామ్ ప్రయత్నించారనే చెప్పవచ్చును.
Source: వినోదం | 19 Jul 2008 | 8:03 am

జులై 19, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు భక్తి కార్యక్రమాలు, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు శాంతి సందేశం, 9.00 గంటలకు టెలీషాపింగ్, 9.15 గంటలకు టాలీవుడ్ టైమ్, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2008 | 7:58 am

పార్టీ ఎంపీలతో సోనియా మంతనాలు

లోక్‌సభలో మరో 72 గంటల్లో విశ్వాస పరీక్ష జరుగనుంది. యూపీఏ భవితవ్యం తేలనుంది. రాజకీయ పార్టీలో మౌనం రాజ్యమేలుతోంది. ముఖ్యంగా అధికారపక్ష నేతల్లో నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. పైకి మాత్రం బలం ఉందని డాంభికాలు పలుకుతున్నారు.
Source: జాతీయ | 19 Jul 2008 | 7:29 am

"మీకోసం" యాత్రవల్లే ఇదంతా.. : బొత్సా

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తలపెట్టిన "మీ కోసం" యాత్రవల్లే రాష్ట్రంలో వర్షాలు కరువయ్యాయని గృహ నిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. బాబు ఎక్కడ కాలిడితే అక్కడ వర్షాలు కురవడం లేదని ఆయన ఆరోపించారు.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 7:08 am

రాష్ట్రంలో క్రైస్తవుల కోసం ప్రత్యేక విభాగం

రాష్ట్రంలోని క్రైస్తవ సంక్షేమం కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర మైనారిటీ శాఖ కింద ఈ ప్రత్యేక విభాగం పని చేస్తుంది. ఈ విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ పర్యవేక్షణలో కార్యకలాపాలు సాగిస్తుంది.
Source: ఏపీ న్యూస్ | 19 Jul 2008 | 6:56 am

రాష్ట్ర వ్యాప్తంగా "ప్రిన్స్" బర్త్‌ డే

"పోకిరి" హీరో ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు వేడుకలకు రంగం సిద్ధమౌతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 2నుంచి 9వతేదీ వరకు మహేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు జరిపేందుకు అభిమాన సంఘాలు రెడీ అవుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో అభిమానులు పెద్ద..
Source: వినోదం | 19 Jul 2008 | 6:47 am

అంకెల గారడీలో విజయం మాదే: ప్రణబ్

వచ్చే 22వ తేదీన లోక్‌సభలో జరుగనున్న అంకెల గారడీలో యూపీఏ ప్రభుత్వం విజయం సాధిస్తుందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ ధీమా వ్యక్తం చేశారు. చంఢీగఢ్‌లో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
Source: జాతీయ | 19 Jul 2008 | 5:17 am

నేడు లెఫ్ట్ కేంద్ర కమిటీ భేటీ

విశ్వాస పరీక్షకు మరో మూడు రోజుల సమయం మాత్రమే మిగిలివుంది. వామపక్ష పార్టీలకు చెందిన అగ్రనేతలు తమ ప్రణాళికలను మరింత వేగవంతం చేశారు. అణు ఒప్పందం వ్యవహారంపై కేంద్రానికి కళ్లెం వేసేందుకు అన్ని చర్యలు చేపట్టారు.
Source: జాతీయ | 19 Jul 2008 | 4:41 am

విశ్వాస పరీక్షలో ఓటు వేయనున్న వాజ్‌పేయి

ఈనెల 22వ తేదీన యూపీఏ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగనున్న విశ్వాస పరీక్షలో భారతీయ జనతా పార్టీ అగ్రనేత, మాజీ ప్రధాని అటల్ బీహారి వాజ్‌పేయి ఓటు వేయనున్నారు. ఇందుకోసం ఆయన 22వ తేదీన లోక్‌సభకు హాజరుకానున్నారు.
Source: జాతీయ | 19 Jul 2008 | 4:30 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 19 Jul 2008 | 3:20 am

యూపిఎ నేతల గుండెల్లో రైళ్లు

బల పరీక్ష సమయం దగ్గరపడుతున్నకొద్దీ హస్తినలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ఈ నెల 22న ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ బలపరీక్షను ఎదుర్కోనున్నారు. ఇప్పటివరకూ ఈ పరీక్షలను ఎదుర్కొన్న ప్రధాన మంత్రుల్లో ఆయన ఆరోవారుగా నిలిచారు.
Source: జాతీయ | 18 Jul 2008 | 3:17 pm

వరుణహోమం నిర్వహించిన సినీ ప్రముఖులు

సినిమాల్లోనే కాదు. నిజ జీవితంలోనూ సినీ నటులు రాష్ట్ర సుభిక్షంగా వుండాలనే హోమాలు నిర్వహించడం గమనార్హం. గురుపౌర్ణమిని పురస్కరించుకుని...
Source: వినోదం | 18 Jul 2008 | 2:43 pm

దేరా సచ్చా సౌదా ఛీఫ్ అరెస్టుకు డిమాండ్

దేరా సచ్చా సౌదా తెగకు సిక్కులకు మధ్య జరిగిన ఘర్షణలో ఒక సిక్కు వ్యక్తి ప్రాణాలు కోల్పోవడాన్ని శిరోమణి అకాలీదళ్ ప్రబంధక్ కమిటీ (ఎస్‌జీపీసీ) తీవ్రంగా ఖండించింది.
Source: జాతీయ | 18 Jul 2008 | 1:11 pm