|
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికుల ఆందోళనతమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 వేల మంది ఆర్టీసీ కాంట్రాక్టు కార్మికులు ఆందోళన చేపట్టారని అధికార వర్గాలు వెల్లడించాయి. చాలా కాలంగా తాము కోరుతున్న ఈ డిమాండ్ కోసం వారుSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 11:28 am భారత్, ఇరాన్‌లపై ఐఏఈఏ చీఫ్‌తో బర్న్స్ సమావేశంఅమెరికా సీనియర్ దౌత్య ప్రతినిధి విలియం బర్న్స్ శుక్రవారం అంతర్జాతీయ అణు శక్తి సంస్థ (ఐఏఈఏ)తో సమావేశం కానున్నారు. ఇరాన్ కొనసాగిస్తున్న వివాదాస్పద అణు కార్యక్రమం, భారత్- అమెరికా పౌర అణు ఒప్పందంపై ఈ సమావేశంలో ఐఏఈఏSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 11:22 am మార్కెట్‌లో లాభాలు: 513 పాయింట్ల లాభంతో సెన్సెక్స్శుక్రవారం ఉదయం 123 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన మార్కెట్ నష్టాల్లో కూరుకుపోయింది. కాగా, త్వరిత గతిన పుంజుకున్న సెన్సెక్స్ లాభాల బాటన సాగింది. శుక్రవారం సాయంత్రం నాలుగు గంటల సమయానికి 513 పాయింట్ల లాభంతో...Source: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 11:15 am ఎస్పీ పార్లమెంటరీ పార్టీ సమావేశం: కొందరు గైర్హాజరులోక్సభలో ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో యూపీఏ ప్రభుత్వానికి కీలకమైన మద్దతును ఇవ్వబోతున్న సమాజ్‌వాదీ పార్టీ పార్లమెంటరీ సమావేశం శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో వింత పరిస్థితి నెలకొంది. పార్టీకి చెందిన 39 మంది ఎంపీల్లోSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 11:11 am లెఫ్ట్‌వి కాలం చెల్లిన సిద్ధాంతాలు: జైపాల్ రెడ్డివామపక్షాలు కాలం చెల్లిన సిద్ధాంతాలు అవలంబిస్తున్నాయని కేంద్ర మంతి జైపాల్ రెడ్డి దుయ్యబట్టారు. భారత్- అమెరికా అణు ఒప్పందాన్ని అవి వ్యతిరేకించడానికి అవి అవలంబిస్తున్న ఈ కాలంచెల్లిన సిద్ధాంతాలే కారణమని పేర్కొన్నారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:58 am రేపు ప్రధాని మన్మోహన్‌ను కలుసుకోనున్న దేవెగౌడజేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి హెచ్‌డీ దేవెగౌడ శనివారం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌ను కలుసుకోనున్నారు. ఈరోజు ఉదయం ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా హెచ్‌డీ దేవెగౌడకు ఫోన్ చేశారు. ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో కాంగ్రెస్Source: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:57 am తెలంగాణలో విద్యార్థులచే తరగతుల బహిష్కరణప్రత్యేక రాష్ట్రంకోసం కాంగ్రెస్ అధిష్టానంపై ఒత్తిడి తీసుకురావాలని ఆ ప్రాంత కాంగ్రెస్ ఎంపీలను డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం శుక్రవారం తరగతులను బహిష్కరించింది. కేంద్రంలోని యూపీఏ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కుంటున్నSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:56 am భారత క్రీడాకారిణిలకు బికినీల నుంచి మినహాయింపుబీచ్ వాలీబాల్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో భారత మహిళా క్రీడాకారులకు బికినీల నుంచి మినహాయింపు లభించింది. ఇందుకు సంబంధించిన తుది నిర్ణయాన్ని అంతర్జాతీయ వాలీబాల్ ఫెడరేషన్ శుక్రవారం ప్రకటించింది. దీంతో చెన్నైలో జరుగుతున్నSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:49 am కోతలకు కోత వేసేందుకు సిద్ధం : ప్రభుత్వంరాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్ కోతలను అరికట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అదనపు విద్యుత్‌ను సేకరించడం ద్వారా రాష్ట్రంలోని ప్రజలకు ఊరట కల్పించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 10:44 am ఎస్సీ సమావేశానికి 16 మంది ఎంపీలే హాజరులోక్సభలో ఈ నెల 22న యూపీఏ ప్రభుత్వాన్ని బలపరీక్షలో గట్టెక్కిస్తుందనుకున్న సమాజ్‌వాదీ పార్టీలో శుక్రవారం వింత పరిస్థితి నెలకొంది. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీలSource: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:37 am అణు ఒప్పందంతో యూపీఏ పతనం: సురవరంభారత్- అమెరికా అణు ఒప్పందం విషయంలో యూపీఏ పతనం కావడం ఖాయమని సీపీఐ జాతీయ ఉప ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి పేర్కొన్నారు. ఈ ఒప్పందంతో దేశభద్రతకు విఘాతం ఏర్పడగలదని చెప్పారు.Source: Yahoo! Telugu: News | 18 Jul 2008 | 10:36 am రాజకీయాల్లోకి రాను: దగ్గుపాటి సురేష్బాబురాజకీయాల్లోకి వచ్చే ఆలోచన లేదని ప్రముఖ నిర్మాత రామానాయుడు కుమారుడు దగ్గుపాటి సురేష్‌బాబు స్పష్టం చేశారు. తన తండ్రి పది సంవత్సరాలు రాజకీయాలలో సేవ చేసి అలసిపోయారని ఆయన గుర్తు చేశారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 10:34 am 'లెప్ట్' రైట్ కాదు : జైపాల్ రెడ్డిఅణు ఒప్పందం విషయంలో వామపక్షాలు సరైన తీరుతో వ్యవహరించడం లేదని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి జైపాల్ రెడ్డి విమర్శించారు. పాతబడ్డ సిద్ధాంతాలనే నేటికీ కొనసాగిస్తున్న కారణంగానే లెప్ట్ పార్టీలు అణు ఒప్పందాన్ని వ్యతిరేకిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 10:33 am దేవగౌడతో మంతనాలు జరిపిన ప్రధానిమాజీ ప్రధాని, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) అధినేత దేవగౌడతో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ టెలిఫోన్ ద్వారా సంభాషించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వానికి బలపరీక్ష సమయంలో జేడీఎస్ మద్దతు తెలపాలని మన్మోహన్ సింగ్ కోరారు.Source: జాతీయ | 18 Jul 2008 | 9:54 am ఎన్డీఏ నేతలను కలిసిన శిబూ సొరెన్జార్ఖండ్ ముక్తీ మోర్చా (జేఎంఎం) అధినేత, మాజీ కేంద్ర మంత్రి శిబూ సొరెన్ ప్రతిపక్ష ఎన్డీఏ నేతలను కలిశారు. జేఎంఎం మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ మరోవైపు వెంపర్లాడుతుంది.Source: జాతీయ | 18 Jul 2008 | 9:35 am కట్టుతప్పిన ఎంపీలు : ఆందోళనలో ఎస్పీఉత్తర ప్రదేశ్‌లో ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ నిర్వహించిన సదస్సుకు ఆ పార్టీకి చెందిన ఎంపీలు కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. దీనితో పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ ఆందోళనలో ఉన్నారు. పార్టీ లోక్‌సభ సభ్యుల కోసం సమావేశాన్ని ఏర్పాటుచేశారు.Source: జాతీయ | 18 Jul 2008 | 9:10 am 'అణు' ప్రకంపనలు : కేసీఆర్ ఛలో ఢిల్లీకేంద్రంలో యూపీఏ సర్కారు బల నిరూపణకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలోని రాజకీయం సైతం వేడెక్కుతోంది. ప్రత్యేక తెలంగాణకు మద్దతిస్తే యూపీఏకు ఓటేస్తానని గతంలో చెప్పిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రస్తుతం యూపీఏ వ్యతిరేకులను కూడగట్టేందుకు సిద్ధమయ్యారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 8:51 am ఎంపీలకు విప్ జారీచేసిన సీపీఎంలోక్సభలో తమ పార్టీ ఎంపీలకు సీపీఎం పార్టీ విప్ జారీచేసింది. అయితే స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ పేరును పార్టీ జోడించలేదు. లోక్‌సభలో జులై 22వ తేదీన జరిగే విశ్వాస పరీక్షలో యూపీఏకు వ్యతిరేకంగా సభ్యులు ఓటు వేయాలని సీపీఎం తన విప్‌లో స్పష్టం చేసింది.Source: జాతీయ | 18 Jul 2008 | 8:25 am ఎవరినీ కించపరిచేందుకు కాదు: నిర్మాతల మండలిసినిమాలు తీసేది ఎవరినీ కించపరిచేందుకు కాదని నిర్మాతల మండలి పేర్కొంది. గత కొన్ని రోజులుగా కొన్ని సినిమాలలో దళిత వర్గాలను, వికలాంగులను కించపరిచారని పలువురు ఆందోళన చేపట్టిన నేపథ్యంలో నిర్మాతల మండలి ఈ మేరకు ప్రకటించింది.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 7:57 am అన్యాయం జరిగింది : న్యాయం చేయండిఈ ఏడాది ఆగస్టులో జరగనున్న ఒలింపిక్ క్రీడలకు తనను ఎంపిక చేయకుండా అన్యాయం చేశారని రాష్ట్రానికి చెందిన వెయిట్ లిప్టింగ్ క్రీడాకారిణి పూజారి శైలజి వాపోయింది. ఈ విషయంలో ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 6:52 am రాజా హీరోగా ప్రారంభమయిన చిత్ర షూటింగ్రాజా హీరోగా, ముంబై నటి తీర్థను హీరోయిన్‌గా పరిచయం చేస్తూ శ్రావ్య ఫిలింస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి సంబంధించి గురువారం నాడు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. చిత్ర నిర్మాతలు కె.బసిరెడ్డి, రవీంద్రబాబులు...Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 6:30 am పట్టువీడని సోమనాథ్ : సీపీఎం గరంగరంస్పీకర్ పదవికి రాజీనామా చేయబోనని బీష్మించుకున్న సోమనాథ్ వ్యవహరంపై సీపీఎం గుర్రుగా ఉంది. యూపీఏ ప్రభుత్వానికి పార్టీ మద్దతు ఉపసంహరించిన నేపథ్యంలో పార్టీ ఎంపీగా అదేబాటలో నడవాల్సిందిపోయి స్వతంత్రంగా వ్యవహరిస్తున్న సోమనాథ్‌పై చర్య తీసుకునే దిశగా సీపీఎం సిద్ధమవుతోంది.Source: జాతీయ | 18 Jul 2008 | 5:59 am అధికారాల కోసం చిరు రావడం లేదు: పవన్అన్నయ్య.. మెగాస్టార్ చిరంజీవి.. పదవి, అధికారాల కోసం రాజకీయాల్లోకి రావడం లేదని.. ఆయన మార్పు కోరుకుంటున్నారని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్నవారు నాయకులు కారని.. కేవలం పాలకులు మాత్రమేనని.. వీరి వల్ల సామాన్యులకు మంచి...Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 5:59 am రాష్ట్రంలో ఘనంగా గురుపూర్ణిమ మహోత్సవాలురాష్ట్రంలో గురుపూర్ణిమ మహోత్సవాన్ని సాయి భక్తులు అత్యంత భక్తిశ్రద్ధల మధ్య జరుపుకుంటున్నారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు సాయి ఆలయాలను సందర్శించి అర్చనలు, అభిషేకాలు తదితర కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 5:45 am ఈ నెల 25న ఉల్లాసంగా, ఉత్సాహంగాయశోసాగర్, స్నేహ ఉల్లాల్‌లను కొత్తగా పరిచయం చేస్తూ నిర్మించిన చిత్రం ఉల్లాసంగా, ఉత్సాహంగా. అమృత్ అమర్‌నాధ్‌ఆర్ట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి కరుణాకరన్ దర్శకత్వం వహిస్తున్నారు.Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 5:42 am సోనియా కోసం ఇంత ఆర్భాటమా : బాబు విమర్శకాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పర్యటన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్మును దుబారా చేసిందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ప్రభుత్వ పధకాన్ని ప్రారంభించడం కోసం ఏ హోదాలో సోనియాను రాష్ట్రానికి ఆహ్వానించారో చెప్పాలంటూ ఆయన డిమాండ్ చేశారు.Source: ఏపీ న్యూస్ | 18 Jul 2008 | 5:23 am ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించం : వెంకయ్యకేంద్రంలో మారుతున్న సమీకరణాల దృష్ట్యా రానున్న రోజుల్లో యూపీఏ ప్రభుత్వం కూలిపోతే తాము ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నించబోమని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. బలపరీక్షలో యూపీఏ ప్రభుత్వం విఫలమైన పక్షంలో ఎన్నికలకు వెళ్లడానికే తాము మొగ్గు చూపుతామని ఆయన తెలిపారు.Source: జాతీయ | 18 Jul 2008 | 4:58 am చెంపలు వాయించుకుంటున్నాం : కళ్లు తెరవండితప్పు చేసినపుడు చెంపలు వేసుకుని ఎదుటివారిని మన్నించమనడం మనకు అలవాటే. అలాగే ఎదుటివారు తప్పుచేసినపుడు వారి చెంపలు వాయించి తప్పు తెలుసుకునేలా చేయడం మనకు తెలిసిందే. ఈ రెండూ కాకుండా ఎదుటివారి తప్పు ఎత్తి చూపడం కోసం తమ చెంపలు వాయించుకుంటే ఎలా ఉంటుంది.Source: జాతీయ | 18 Jul 2008 | 4:57 am జులై 18, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా, 12.00 గంటలకు విధి...Source: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 3:26 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 18 Jul 2008 | 3:14 am యూపీఏకు ఢోకాలేదు : కరుణానిధిలోక్సభలో జులై 22వ తేదీన జరిగే విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్య ప్రగతిశీల కూటమి (యూపీఏ) ప్రభుత్వానికి ఢోకా లేదని తమిళనాడు సీఎం కరుణానిధి ధీమా వ్యక్తం చేశారు.Source: జాతీయ | 17 Jul 2008 | 3:07 pm ఆరోగ్య శ్రీ పథకానికి సోనియా శ్రీకారం!రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రెండో దశ ఆరోగ్య శ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం అధికారికంగా అమల్లోకి వచ్చినట్టైంది.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:52 pm మహిళలపై వివక్ష వద్దు : సోనియా గాంధీమహిళలపై వివక్ష వద్దని, ఆడశిశువులపై వివక్ష చూపడం, వారికి విద్యాభ్యాసం చేయనీయకుండా అడ్డుకోవడం వంటి పురాతన ఆచారాలను పారద్రోలాలని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ మహిళలకు సూచించారు. మహిళలను నిర్లక్ష్యానికి గురిచేయడం సరైంది కాదని, రాష్ట్రంలోని డ్వాక్రా సంఘాలు సాధిస్తున్న విజయాలు చాలా ఎక్కువని ఆమె ప్రశంసించారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:46 pm విశాఖలో భవనం పేలుడు : 8 మంది మృతివిశాఖపట్నం, అక్కయ్యపాలెంలోని ఓ భవనంలో జరిగిన పేలుడు సంఘటనలో 8మంది మృతిచెందారు. అక్కయ్యపాలెం నందినినగర్‌లోని ఓ భవనంలో బాణసంచా పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు ఆ భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు, మరణ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:33 pm వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన గోపిక!"నా ఆటోగ్రాఫ్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ గోపిక వైవాహిక జీవితంలోకి అడుగెట్టింది. గురువారం గోపిక సొంత ఊరైన త్రిశూర్‌లో లండన్ డాక్టర్ అజ్లేష్‌తో ఆమె పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించేది లేదని...Source: వినోదం | 17 Jul 2008 | 11:35 am మావోయిస్టుల కోసం ముమ్మరంగా గాలింపుఒరిస్సాలోని మల్కన్‌గిరి జిల్లాలో భద్రతా వాహనంపై మందుపాతర పేల్చి 24 మంది పోలీసులను బలిగొన్న మావోయిస్టుల కోసం భారీస్థాయి గాలింపు చర్యలు చేపట్టారు.Source: జాతీయ | 17 Jul 2008 | 11:23 am అణు కేంద్రాలు అత్యావశ్యకం : సోనియాదేశంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాల దృష్ట్యా అణు శక్తి ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటు అత్యావశ్యకమని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ వ్యాఖ్యానించారు.Source: జాతీయ | 17 Jul 2008 | 11:22 am పాటల షూటింగ్‌లో మహానగరంలోయశ్వంత్, పూనమ్‌సింగార్, విజయభాస్కర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన మహానగరంలో చిత్రం ప్రస్తుతం మిగిలిన మూడు పాటల షూటింగ్‌లో ఉంది. ఇప్పటివరకు రెండు పాటలు, చిత్ర టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు జీఎల్‌బీ శ్రీనివాస్ తెలిపారు.Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 11:05 am
|