విశాఖలో భవనం పేలుడు : 8 మంది మృతి

విశాఖపట్నం, అక్కయ్యపాలెంలోని ఓ భవనంలో జరిగిన పేలుడు సంఘటనలో 8మంది మృతిచెందారు. అక్కయ్యపాలెం నందినినగర్‌లోని ఓ భవనంలో బాణసంచా పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ఈ పేలుడుకు ఆ భవనం పూర్తిగా ధ్వంసం కావడంతో పాటు, మరణ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:33 pm

కాంగ్రెస్ ఎంపీల ఇళ్ల ముందు ధర్నా: టీఆర్ఎస్

ప్రత్యేక తెలంగాణ అంశంపై మంత్రుల వైఖరికి నిరసనగా తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు వినూత్నంగా ధర్నాకు దిగారు. తెలంగాణపై కేంద్రంలో ఒత్తిడి తీసుకు రావాలంటూ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఇళ్ల....
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:22 pm

దేశంలో అతి పెద్ద ఓడరేవుగా కృష్ణపట్నం

నెల్లూరు జిల్లాలో వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన కృష్ట పట్నం ఓడరేవుకు ఇకపై భారత చిత్ర పటంలో ఓ ప్రత్యేక స్థానం దక్కనుంది. భారత దేశంలోనే అతి పెద్ద ఓడరేవుగా ఇది రూపుదిద్దుకోనుంది. గండగోపాల పట్నంవద్ద...
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 1:16 pm

మెండిస్ కంటే మురళీయే పెద్ద ప్రమాదకారి: హర్భజన్

శ్రీలంక స్పిన్ సంచలనం అజంత మెడింస్ ప్రతిభను తక్కువగా అంచనావేయబోమని టీం ఇండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ చెప్పాడు. అయితే మెండిస్‌తో పోలిస్తే ముత్తయ్య మురళీధరణ్ పెద్ద ప్రమాదరమైన బౌలర్ అని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 12:06 pm

కాంగ్రెస్ పాలనలో చక్కని అభివృద్ధి: సోనియా

కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం చాలా అభివృద్ధి చెందిందని యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. అభివృద్ధి విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని ఆమె కొనియాడారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 11:54 am

బర్దన్, అజిత్ సింగ్ భేటి: ఎటూ తేల్చని ఆర్ఎల్‌డీ

కేంద్రంలో అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వాన్ని ఈ నెల 22న జరిగే విశ్వాసపరీక్షలో గట్టెక్కకుండా చేసేందుకు లెఫ్ట్ పార్టీలు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. ఇందులో భాగంగా సీపీఐ ప్రధాన కార్యదర్శి ఏబీ బర్దన్ గురువారం ఆర్ఎల్‌డీ అధిపతి
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 11:37 am

వైవాహిక జీవితంలోకి అడుగెట్టిన గోపిక!

"నా ఆటోగ్రాఫ్" చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైన మలయాళ ముద్దుగుమ్మ గోపిక వైవాహిక జీవితంలోకి అడుగెట్టింది. గురువారం గోపిక సొంత ఊరైన త్రిశూర్‌లో లండన్ డాక్టర్ అజ్లేష్‌తో ఆమె పెళ్లి వైభవంగా జరిగింది. పెళ్లికి తర్వాత సినిమాల్లో నటించేది లేదని...
Source: వినోదం | 17 Jul 2008 | 11:35 am

కోలుకున్న మార్కెట్: 536 పాయింట్ల లాభంతో సెన్సెక్స్

గురువారం ఉదయం 334 పాయింట్ల లాభంతో ప్రారంభమయిన మార్కెట్ మధ్యాహ్న సమయానికి కాస్త నష్టాల బాటలో పయనించినప్పటికీ, క్రమంగా పుంజుకుంది. సెన్సెక్స్ గురువారం సాయంత్రం నాలుగు గంటల
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 11:17 am

పాటల షూటింగ్‌లో మహానగరంలో

యశ్వంత్, పూనమ్‌సింగార్, విజయభాస్కర్, చిత్రం శ్రీను ప్రధాన పాత్రలు పోషించిన మహానగరంలో చిత్రం ప్రస్తుతం మిగిలిన మూడు పాటల షూటింగ్‌లో ఉంది. ఇప్పటివరకు రెండు పాటలు, చిత్ర టాకీ పార్టు పూర్తయిందని దర్శకుడు జీఎల్‌బీ శ్రీనివాస్ తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 11:05 am

మరో ఎనిమిది ఐఐటీల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎనిమిది ఐఐటీలు (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ) ఏర్పాటు చేసేందుకు గురువారం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుత విద్యా సంవత్సరంలోనే ఈ కొత్త ఐఐటీలు ఏర్పాటు కానున్నాయి. విద్యా ప్రమాణాలను
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 11:01 am

కృష్ణపట్నం ఓడరేవు రాష్ట్రానికే ఆదర్శం: వైఎస్

కృష్ణపట్నం ఓడరేవు రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ పేర్కొన్నారు. విదేశాలకు ఈ రేవు ద్వారా ఎగుమతులు బాగా పెరిగే అవకాశమున్నందున నిరుద్యోగులకు చక్కటి అవకాశాలు లభించగలవని చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 10:57 am

పప్పు యాదవ్‌ ఓటేసేందుకు హైకోర్టు అనుమతి

తీహార్ జైలులో యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న వివాదాస్పద ఆర్జేడీ ఎంపీ పప్పు యాదవ్‌కు ఈ నెల 22న పార్లమెంట్‌లో జరిగే విశ్వాసపరీక్షలో ఓటేసేందుకు ఢిల్లీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. 1998, జున్ 14న సీపీఎం ఎమ్మెల్యే అజి్ సర్కార్‌ను
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 10:49 am

కాంగ్రెస్ ఎంపీల ఇళ్ల వద్ద తెరాస ఆందోళనలు

తెలంగాణలోని కాంగ్రెస్ ఎంపీల ఇళ్ల వద్ద తెరాస నేతలు గురువారం ఆందోళనలు చేపట్టారు. యూపీఏ సర్కారు విశ్వాస పరీక్ష ఎదుర్కుంటున్న సమయంలో తెలంగాణ సాధనకోసం ఎంపీలు పనిచేయాలని డిమాండ్ చేస్తూ వారు ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 10:43 am

వామపక్షాలు యూపీఏతో జతకడతాయేమో!

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో వామపక్షాలు విభేదించినప్పటికీ, కేంద్ర స్థాయిలో మాత్రం యుపిఎ ప్రభుత్వంతో అవి కలిసే ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ పేర్కొన్నారు. హైదరాబాద్‌‌లోని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల...
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 10:12 am

త్వరలో డిఎస్సీ-2008 నోటిఫికేషన్ విడుదల

నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఆతృతగా ఎదురుచుస్తున్న డీఎస్సీ-2008కి మోక్షం కలిగించనుంది. జూలై నెలాఖరులోగా డిఎస్సీ నోటిఫికేషన్‌ను జారీచేస్తామని పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ...
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 10:11 am

కమల్ "దశావతారం" ట్రెయిలర్ మీకోసం

పద్మభూషణ్ కమల్‌హాసన్ పది విభిన్న పాత్రల్లో నటించి కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న చిత్రం దశావతారం. దాదాపు 1000 ప్రింట్లతో దేశం యావత్తు విడుదలైన ఈ సినిమా అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లోనూ ప్రేక్షకుల ఆదరణ చూరగొంటుంది. ఇకపోతే హిందీలోనూ...
Source: వినోదం | 17 Jul 2008 | 10:11 am

యువతారాగణం కోసం స్టార్ హంట్ కార్యక్రమం

లార్స్‌కో ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బేనర్‌పై రూపొందుతున్న చిత్రం స్నేహగీతం. ఈ చిత్రంలో నటించేందుకు యువతారాగణాన్ని ఆహ్వానిస్తున్నారు. ఇందుకోసం స్టార్ హంట్ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు దర్శకుడిగా పరిచయం...
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 10:11 am

దేశభద్రతపై రాజీ లేదు: సోనియా స్పష్టీకరణ

అణు ఒప్పందం విషయంలో దేశ భద్రతపై రాజీపడేది లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ స్పష్టం చేశారు. దేశాభివృద్ధికి భవిష్యత్తులో ఏర్పడే విద్యుత్ కొరతను దృష్టిలో పెట్టుకునే ఈ ఒప్పందం కుదుర్చుకున్నామని ఆమె పేర్కొన్నారు. దేశభద్రతను...
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 9:59 am

పవన్ భుజాలపై పులి చిత్ర బాధ్యతలు

పులి చిత్ర బాధ్యతలను పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ తన భుజాలపై వేసుకున్నాడట. పులి చిత్ర దర్శకుడు ఎస్.జె సూర్యకు ఇటీవలే ఓ తమిళ షూటింగ్‌లో గాయం కావడంతో పవన్ ఈ బాధ్యతలను మోయవలసిన పరిస్థితి ఏర్పడింది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 9:55 am

ఇండియనాపోలిస్ టోర్నీ: పేస్- భూపతి ఇంటిముఖం

భారత అగ్రశ్రేణి టెన్నిస్ డబుల్స్ క్రీడాకారులు మహేష్ భూపతి, లియాండర్ పేస్ ఇండియనాపోలిస్‌ టోర్నీ నుంచి వెనుదిరిగారు. ఇండియనాపోలిస్ ఛాంపియన్‌షిప్స్ తొలి రౌండు మ్యాచ్‌లో భూపతి- పేస్ జోడి డానియల్ నెస్టోర్- ఫ్రెడెరిక్ నీమెయెర్ చేతిలో
Source: Yahoo! Telugu: News | 17 Jul 2008 | 9:53 am

సోనియాచే కృష్ణపట్నం ఓడరేవు ప్రారంభం

యూపీఏ ఛైర్ పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ గురువారం కృష్ణపట్నం ఓడరేవును జాతికి అంకితం చేశారు. గురువారం మధ్యాహ్నం రెండుగంటలకు కృష్ణపట్నం చేరుకున్న సోనియా ఓడరేవును లాంఛనంగా ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 9:42 am

ప్రజలను తెలుగులో పలకరించిన సోనియా!

అందరికీ నమస్కారం.. మీరు బాగున్నారా? అని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ తెలుగు ప్రజలను పలకరించారు. ఎక్కడో తెలుసుగా నెల్లూరు గడ్డపైనే..!. రాష్ట్ర పర్యటన నిమిత్తం నెల్లూరు చేరుకున్న ఆమె అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా పేరును పొట్టి శ్రీరాములు పేరుగా మార్చటాన్ని అభినందించారు.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 9:42 am

గీతం ఆల్బమ్ కీరవాణిచే ఆవిష్కరణ

వర్థమాన గాయకుడు రఘురాం రూపొందించిన గీతం ఆల్బమ్ బుధవారం ఫిలింఛాంబర్‌లో కీరవాణి ఆవిష్కరించారు. కాగా, ఈ ఆల్బమ్‌ను ఆదిత్యమ్యూజిక్ మార్కెట్ చేస్తోంది.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 9:34 am

బ్లేడ్‌బాబ్జీ ఆడియో విడుదలకు ఏర్పాట్లు

నరేష్, సయాలీ భగత్‌లు హీరోహీరోయిన్లుగా నటించిన బ్లేడ్‌బాబ్జీ చిత్ర ఆడియోను ఈ నెల 21న విడుదల చేయనున్నట్టు దర్శకుడు దేవీప్రసాద్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ చిత్రం రీరికార్డింగ్ జరుపుకుంటోందని అన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 8:50 am

క్షమాపణలు తెలిపిన మహారధి నిర్మాత

బాలకృష్ణ నటించిన మహారధి చిత్రంలోని ఓ పాటను హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా చిత్రించారని భజరంగ్‌దళ్ దాఖలు చేసిన కేసుపై ఆ చిత్ర నిర్మాత వారాడ అప్పారావు క్షమాపణలు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 8:30 am

రవితేజ, అనుష్క జంటగా బలాదూర్

రవితేజ, అనుష్క జంటగా సురేష్‌బాబు నిర్మిస్తున్న చిత్రం బలాదూర్. రవితేజ శైలిలో వినోదం, సెంటిమెంట్‌లు ఈ చిత్రంలో ఉంటాయని నిర్మాత తెలిపారు. తొలుత రవితేజకు సూటయ్యే టైటిల్ పెట్టాలని భావించినట్టు చెప్పారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 7:35 am

ఆరోగ్య శ్రీ పథకానికి సోనియా శ్రీకారం!

రాష్ట్ర పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ రెండో దశ ఆరోగ్య శ్రీ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనితో రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య శ్రీ పథకం అధికారికంగా అమల్లోకి వచ్చినట్టైంది.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 7:21 am

రీరికార్డింగ్ పూర్తి చేసుకున్న సిటీలైఫ్

ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించగల సత్తా ఉన్న సిటీలైఫ్ చిత్రం ప్రస్తుతం రీరికార్డింగ్‌ను పూర్తి చేసుకుని డి.టి.ఎస్ మిక్సింగ్‌కు సిద్ధమయింది. ఈ చిత్ర ఆడియో ఇటీవలే విడుదలై ఎక్కువ క్రేజ్ సంపాదించిందని నిర్మాత వెంకటేశ్వరరావు తెలిపారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 6:47 am

నిర్మాణానంతర కార్యక్రమాల్లో నా అనేవాడు

టి.ప్రశాంత స్వీయదర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం నా అనేవాడు. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలను జరుపుకుంటోందని యూనిట్ వర్గాలు వెల్లడించాయి.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 6:29 am

ప్రారంభమయిన అరణ్యం చిత్ర షూటింగ్

నాగబాబు ఫారెస్ట్ ఆఫీసర్‌గా నటిస్తున్న అరణ్యం చిత్ర బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడీయోస్‌లో ప్రారంభమయింది. ఈ చిత్రాన్ని పి.ఎస్.ఎం ప్రొడక్షన్ బేనర్‌పై ఎ.వి.రావు, మాధురి నిర్మిస్తుండగా, మెండెం శ్రీధర్ దర్శకత్వం వహిస్తున్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 17 Jul 2008 | 6:09 am

ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించనున్న సోనియా

ఆరోగ్య భీమా పథకం కార్యక్రమం కింద పేద ప్రజల కోసం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేడు నెల్లూరు జిల్లాలో రెండో విడత ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఆమె నేడు వస్తున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లను చేసింది. ఒక రోజు పాటు ఆమె రాష్ట్రంలో పర్యటిస్తారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Source: ఏపీ న్యూస్ | 17 Jul 2008 | 5:48 am

ఒరిస్సాలో మళ్లీ మావోయిస్టు పంజా: 21 మంది బలి

ఒరిస్సాలోని మల్కాన్‌గిరి జిల్లాలో మావోయిస్టులు మళ్లీ జరిపిన దాడిలో 21 మంది పోలీసులు ప్రాణాలు కోల్పోయారని అనుమానిస్తున్నారు. మావోయుస్టులు మందుపాతర పేల్చి పోలీసులను మట్టుబెట్టారని ఒరిస్సా డీజీపీ గోపాల్ చంద్ర నందా చెప్పారు.
Source: జాతీయ | 16 Jul 2008 | 3:24 pm

రాహుల్ జూలై 27న రాష్ట్రానికి రాక

రాష్ట్రంలో యువజన కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటు చేయనున్న 'ఆమ్ ఆద్మీ సిపాయి'లకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించటానికి జూలై 27 తేదీన రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని యువజన కాంగ్రెస్...
Source: ఏపీ న్యూస్ | 16 Jul 2008 | 3:14 pm