పంజాగుట్ట ఫ్లై ఓవర్‌ను ప్రారంభంచిన సీఎం

రాజధాని వాసుల ట్రాఫిక్ చిక్కులు ఒక్కొక్కటిగా పరిష్కారమవుతున్నాయి. ఇందుకోస రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌‍‌లోని కీలక కూడళ్ళలో నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ల నిర్మాణం ఒక్కొక్కటిగా పూర్తవుతుంది. తాజాగా పంజాగుట్ట ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయింది. దీన్ని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ఆదివారం ప్రారంభించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2008 | 10:20 am

బేరసారాలకు దిగిన కేంద్రం: రాఘవులు

కేంద్రంలోని యూపీఏ సర్కారు తన బలాన్ని నిరూపించుకునేందుకు బేరసారాలకు ఒడిగట్టిందని సీపీఎం రాష్ట్ర శాఖ కార్యదర్శి బి.రాఘవులు ఆరోపించారు. తమకు అవసరమైన మెజారిటీ సంఖ్య 272 కోసం చిన్నచితకా పార్టీలతో బేరసారాలు చేస్తోందన్నారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2008 | 8:52 am

స్వలాభాల కోసమే పార్టీని వీడుతున్నారు: బాబు

ఏళ్ళ తరబడి అధికారాన్ని అనుభవించిన పార్టీ నేతలు తమ స్వలాభాల కోసం బయటకు వెళుతున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. తెదేపా విస్తృత స్థాయి సమావేశం ఆదివారం ఖమ్మం జిల్లాలో జరిగింది.
Source: ఏపీ న్యూస్ | 13 Jul 2008 | 8:39 am

ఆ దాడి వెనుక ఐఎస్ఐ హస్తం: ఎన్‌ఎస్ఏ

ఆఫ్గనిస్థాన్‌ రాజధాని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంపై జరిగిన కారుబాంబు దాడిలో పాకిస్థాన్‌ హస్తమున్నట్టు జాతీయ భద్రతా విభాగం స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించిన స్పష్టమైన సమాచారం లభ్యమైందని జాతీయ భద్రతా సలహాదారు ఎంకే.నారాయణన్ ప్రకటించారు.
Source: జాతీయ | 13 Jul 2008 | 6:19 am

ఒప్పందంపై విస్తృత ప్రచారానికి సోనియా ఆదేశం

విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత్-అమెరికా పౌర అణు ఒప్పందంపై విస్తృత స్థాయి ప్రచారానికి శ్రీకారం చుట్టాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ పిలుపునిచ్చారు. దేశానికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చే ఈ ఒప్పందాన్ని ప్రజలకు పూర్తిగా అర్ధమయ్యేలా ప్రచారం చేయాలని ఆమె ఆదేశించారు.
Source: జాతీయ | 13 Jul 2008 | 5:57 am

లెఫ్ట్ నేతల్లో పొడచూపిన అభిప్రాయభేదాలు!

అణు ప్రకంపనలు లెఫ్ట్ కేంద్ర కమిటీని తాకాయి. సీపీఎం అగ్రనేత ప్రకాష్ కారత్ మొండి వైఖరి వల్లే పరిస్థితి ఇంతదాకా వచ్చిందని వామపక్షాలకు చెందిన పలువురు నేతలు లోలోపల మథన పడుతున్నారు. కానీ ఆ పార్టీ కేంద్ర కమిటీ మాత్రం అలాంటిదేమీ లేదని ప్రకటనలు గుప్పిస్తోంది.
Source: జాతీయ | 13 Jul 2008 | 5:46 am

జూన్ 13, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు శుభోదయం, 9.00 గంటలకు పంచతంత్రం, 9.30 గంటలకు శ్రీ భాగవతం, 10.30
Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2008 | 5:13 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 13 Jul 2008 | 5:09 am

ఎంపీలకై యూపీఏ వెతుకులాట : చంద్రబాబు

అణు ఒప్పందం విషయమై ఈ నెల 22 తేదీన లోక్‌సభలో జరగనున్న విశ్వాస పరీక్షలో నెగ్గడానికై యూపీఏ ప్రభుత్వం ఎంపీలను కొనుగోలు చేసి ప్రభుత్వాన్ని నిలబెట్టాలని యోచిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 2:29 pm

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం జరుగనుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగవరంలో భేటీ కానుంది. 'మీ కోసం' యాత్రలో నిమగ్నమైవున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 2:18 pm

ఎన్డీఏ వైపే ప్రజల మొగ్గు : అద్వానీ

జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) వైపే దేశ ప్రజలు మొగ్గు చూపుతున్నారని భాజపా మాజీ అధ్యక్షుడు, ప్రధానమంత్రి అభ్యర్ధి ఎల్‌కే అద్వానీ చెప్పారు. లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు నేటి నుంచి 2009 మొదట్లోపు ఏ సమయంలోనైనా జరగవచ్చని తెలిపారు. దీనికి పార్టీ శ్రేణులు సన్నద్ధం...
Source: జాతీయ | 12 Jul 2008 | 2:03 pm

యూజర్ ఛార్జీల మోతకు రంగం సిద్ధం.!

హైదారాబాద్‌లో నిర్మితమైన శ్రీ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అత్యాధునిక సొబగులతో నిర్మితమైన విమానాశ్రయాల్లో ఒకటి. నగర శివారు ప్రాంతంలో వెలసిన ఇది స్వదేశీ, విదేశీ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 1:40 pm

జనాభా నియంత్రణలో రాష్ట్రానిదే అగ్రస్థానం

జనాభా నియంత్రణలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సంభాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:51 am

కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్నికోల్పోయింది: లక్ష్మణ్

కాంగ్రెస్‌ పార్టీ నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని, ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:38 am

ఎన్టీఆర్‌లా రాజకీయాల్లోకి వస్తా: మోహన్ బాబు

దేవుని ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభించినపుడు ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రవేశిస్తానని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు అన్నారు. ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:33 am

జమ్మూకాశ్మీర్ బంద్‌కు సంఘర్ష్ సమితి పిలుపు

శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ శ్రీ బాబా అమర్‌నాథ్ యాత్రా సంఘర్ష్ సమితి జమ్మూకాశ్మీర్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను వచ్చే 16వ తేదీన నిర్వహించతలపెట్టింది. ఇందుకోసం ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకు సమ్మె నోటీసును అందజేసింది.
Source: జాతీయ | 12 Jul 2008 | 11:13 am

యాభై రోజుల తర్వాత స్వేచ్ఛా వాయువులు

దేశంలో సంచనలం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన హతురాలి తండ్రి రాజేష్ తల్వార్‌ శనివారం బెయిలుపై విడుదలయ్యారు. సుమారు యాభై రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు.
Source: జాతీయ | 12 Jul 2008 | 10:55 am

తనపై కక్ష కట్టిన ఆ మూడు పార్టీలు: మాయా

తనను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, భారతీయ జనతా, సమాజ్‌వాది పార్టీలు పావులు కదుపుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు.
Source: జాతీయ | 12 Jul 2008 | 10:53 am