యూజర్ ఛార్జీల మోతకు రంగం సిద్ధం.!

హైదారాబాద్‌లో నిర్మితమైన శ్రీ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ అత్యాధునిక సొబగులతో నిర్మితమైన విమానాశ్రయాల్లో ఒకటి. నగర శివారు ప్రాంతంలో వెలసిన ఇది స్వదేశీ, విదేశీ ప్రయాణికులను ఎంతగానో ఆకట్టుకంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 1:08 pm

జనాభా నియంత్రణలో రాష్ట్రానిదే అగ్రస్థానం

జనాభా నియంత్రణలో మన రాష్ట్రమే అగ్రస్థానంలో ఉందని రాష్ట్ర వైద్య, కుటుంబ సంక్షేమ శాఖామంత్రి సంభాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:51 am

కాంగ్రెస్ నైతిక స్థైర్యాన్నికోల్పోయింది: లక్ష్మణ్

కాంగ్రెస్‌ పార్టీ నైతిక స్థైర్యాన్ని కోల్పోయిందని, ప్రస్తుతం ఆ పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోందని భారతీయ జనతా పార్టీ జాతీయ మాజీ అధ్యక్షుడు బంగారు లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. తిరుపతిలో...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:38 am

ఎన్టీఆర్‌లా రాజకీయాల్లోకి వస్తా: మోహన్ బాబు

దేవుని ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభించినపుడు ఖచ్చితంగా రాజకీయాల్లో ప్రవేశిస్తానని సినీ నటుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు మంచు మోహన్ బాబు అన్నారు. ఆయన శ్రీకాళహస్తికి వచ్చారు. ఈ సందర్భంగా ...
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 11:33 am

జమ్మూకాశ్మీర్ బంద్‌కు సంఘర్ష్ సమితి పిలుపు

శ్రీ అమర్‌నాథ్ ఆలయ బోర్డుకు కేటాయించిన భూమిని తిరిగి అప్పగించాలని కోరుతూ శ్రీ బాబా అమర్‌నాథ్ యాత్రా సంఘర్ష్ సమితి జమ్మూకాశ్మీర్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ బంద్‌ను వచ్చే 16వ తేదీన నిర్వహించతలపెట్టింది. ఇందుకోసం ఆ రాష్ట్ర గవర్నర్ ఎన్.ఎన్.వోహ్రాకు సమ్మె నోటీసును అందజేసింది.
Source: జాతీయ | 12 Jul 2008 | 11:13 am

యాభై రోజుల తర్వాత స్వేచ్ఛా వాయువులు

దేశంలో సంచనలం సృష్టించిన ఆరుషి తల్వార్ హత్య కేసులో సీబీఐ అరెస్టు చేసిన హతురాలి తండ్రి రాజేష్ తల్వార్‌ శనివారం బెయిలుపై విడుదలయ్యారు. సుమారు యాభై రోజుల పాటు జైలు జీవితం గడిపిన ఆయన ఎట్టకేలకు స్వేచ్ఛా ప్రపంచంలోకి వచ్చారు.
Source: జాతీయ | 12 Jul 2008 | 10:55 am

తనపై కక్ష కట్టిన ఆ మూడు పార్టీలు: మాయా

తనను లక్ష్యంగా చేసుకొని కాంగ్రెస్, భారతీయ జనతా, సమాజ్‌వాది పార్టీలు పావులు కదుపుతున్నాయని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయావతి ధ్వజమెత్తారు.
Source: జాతీయ | 12 Jul 2008 | 10:53 am

అణు బంధంపై ఎన్నికలను ఎదుర్కోండి : సిపిఎం

అణు ఒప్పందం ప్రచారాంశంగా ఎన్నికల్లో పాల్గొనాలని సిపిఎం నేడు కాంగ్రెస్ పార్టీని సవాలు చేసింది. యుపిఎ ప్రభుత్వం ఈ విషయంలో ఏకాకి అయినందున దేశ ప్రజలు అణు ఒప్పందంపై కాంగ్రెస్ వైఖరిని తిప్పికొడతారని తాము నమ్ముతున్నట్లుగా సిపిఎం పేర్కొంది.
Source: జాతీయ | 12 Jul 2008 | 9:00 am

నేడు తెదేపా పొలిట్‌బ్యూరో భేటీ

తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం శనివారం జరుగనుంది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గంగవరంలో భేటీ కానుంది. 'మీ కోసం' యాత్రలో నిమగ్నమైవున్న పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఆ ప్రాంతంలో పర్యటిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 5:49 am

బలపరీక్షలో విజయం మాదే: ప్రధాని

ఈ నెలలో జరుగనున్న యూపీఏ ప్రభుత్వ విశ్వాస పరీక్షలో విజయం సాధించి తీరుతామని ప్రధాని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా నివాసంలో సుమారు రెండు గంటల పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఇందులో రాహుల్‌గాంధీతో సహా మొత్తం 32 మంది సభ్యులు పాల్గొన్నారు.
Source: జాతీయ | 12 Jul 2008 | 5:44 am

అనిల్ అంబానీ-చిరంజీవిల భేటీ

మెగాస్టార్ చిరంజీవిపై పారిశ్రామికవేత్తల దృష్టి పడింది. ఆయన కొత్తగా రాజకీయ పార్టీ స్థాపించనున్నట్టు వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ రహస్య సమావేశం కొద్ది రోజుల క్రితం చిరంజీవి నివాసంలో జరిగినట్టు తాజా సమాచారం.
Source: ఏపీ న్యూస్ | 12 Jul 2008 | 4:30 am

యూపీఏకు వ్యతిరేకంగా యూఎన్‌పీఏ ఓటు

ఊహించినట్టుగానే సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ నేతృత్వంలో ఏర్పడిన తృతీయ కూటమి (యూఎన్‌పీఏ) మూడు ముక్కలైంది. అణు ఒప్పందం పుణ్యమాని ఎస్పీ కాంగ్రెస్‌తో చేతులు కలిపింది. అంతకుముందే యూఎన్‌పీఏ కూటమిలోని అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తప్పుకున్న విషయం తెల్పిందే.
Source: జాతీయ | 12 Jul 2008 | 4:09 am

లోక్‌సభలో యూపీఏ విశ్వాస పరీక్ష జులై 22న

కాంగ్రెస్ నేతృత్వంలోని ఐక్యప్రగతి శీల కూటమి (యూపీఏ) ప్రభుత్వ విశ్వాస పరీక్ష లోక్‌సభలో జులై 22వ తేదీన జరుగుతుంది.
Source: జాతీయ | 11 Jul 2008 | 2:29 pm

దేవేందర్‌ పార్టీ పేరు.. "నవ తెలంగాణ ప్రజాపార్టీ"

తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పిన సీనియర్ నేత దేవేందర్ గౌడ్ కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటే ధ్యేయంగా పని చేసే విధంగా 'నవ తెలంగాణా ప్రజాపార్టీ' అనే పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ విషయాన్ని...
Source: ఏపీ న్యూస్ | 11 Jul 2008 | 2:10 pm