|
ఒంటరి పోరుకైనా సిద్ధమే : వైఎస్సార్ఒంటరి పోరుకైనా లేదా పొత్తు కుదుర్చుకుని కలసి పనిచేయడానికైనా తాము సిద్దంగా ఉన్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని ఏ పార్టీతోనైనా కలసి శ్రమించడానికి తాము సిద్ధం ఉన్నామని ఆయన తెలిపారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 9:00 am అవాస్తవ నిందలు వేస్తే సహించం: నాగిరెడ్డితమపై అవాస్తవ ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన భూమా నాగిరెడ్డి హెచ్చరించారు. ఈ విషయమై కర్నూలులో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ... టీడీపీ అధినేత చంద్ర బాబు, జిల్లా నాయకులతో తమపై అనవసర నిందలు వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 8:55 am తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదాపై పరిశీలనతెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ప్రాచీన హోదా పొందేందుకు కన్నడ భాషకు అర్హత ఉందంటూ కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు ఎం. మల్లికార్జున ఖర్గే, మాజీ ముఖ్యమంత్రి ఎన్. ధరం సింగ్ ప్రధానికి వివరించారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 6:57 am వెంకన్న సేవలో ప్రతిభా పాటిల్తిరుపతి దేవస్థానం (తితిదే) ఏర్పాటై 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జరుగుతున్న అమృతోత్సవాలను ప్రారంభించేందుకు విచ్చేసిన భారత తొలి మహిళా రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ సోమవారం శ్రీవారిని సేవించుకున్నారు. సోమవారం ఉదయం 4 గంటలకు శ్రీవారి అర్చన సేవలో పాల్గొన్న ఆమె, అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 6:32 am నూతనోత్సాహంతో మన్మోహన్: నేడు టోక్యో ప్రయాణంసంకీర్ణ ప్రభుత్వానికి సమాజ్‍వాది పార్టీ అందించిన మద్దతుతో ప్రధాని మన్మోహన్‌కు నూతన జవసత్వాలు సమకూరాయి. రెట్టించిన ఉత్సాహంతో జి-8 దేశాల సమావేశానికి సిద్ధమవుతున్నారు. అక్కడి సమావేశం కంటే బుష్‌తో సంభాషణే ఆయనకు ముఖ్యం.Source: Yahoo! Telugu: News | 7 Jul 2008 | 6:31 am త్వరలో పీసీసీ కార్యవర్గం : డీఎస్త్వరలో పీసీసీ కార్యవర్గాన్ని ఏర్పాటుచేయనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు డీఎస్ ప్రకటించారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల్లో మార్పులు చేర్పులపై ఈ కార్యవర్గం సరైన నిర్ణయం తీసుకోనుందని ఆయన చెప్పారు. పీసీసీ కంటే డీసీసీల నియామకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపిన ఆయన, డీసీసీ అధ్యక్షుల నేతృత్వంలో సమర్థ బృందాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 6:31 am యూఎన్‌పీఏ ఎండమావే : వెంకయ్యయూఎన్పీఏ దేశ రాజకీయాల్లో ఎండమావేనని భాజపా సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభివర్ణించారు. మూడో ప్రత్యామ్నాయం దిశగా తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చేసే ప్రయత్నాలు ఏ మాత్రం ఫలించవని వెంకయ్య ఆరోపించారు. ఎన్డీఏ అధికారంలోకి వస్తే అణుఒప్పందాన్ని పునః సమీక్షిస్తామన్నారు.Source: ఏపీ న్యూస్ | 7 Jul 2008 | 6:09 am జులై 07, 2008 కార్యక్రమాలుభారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...Source: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2008 | 3:44 am మీ రోజుSource: Yahoo! Telugu: Entertainment | 7 Jul 2008 | 3:25 am మీ రోజుSource: Yahoo! Telugu: News | 7 Jul 2008 | 3:25 am కాశ్మీర్‌లో సోమవారం ఆజాద్ ప్రభుత్వానికి బలపరీక్షజమ్ము- కాశ్మీర్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న గులామ్ నబీ ఆజాద్ ప్రభుత్వం సోమవారం విశ్వాసపరీక్ష ఎదుర్కోబోతుంది. అయితే ఈ బలపరీక్షలో ఆజాద్ ప్రభుత్వం గట్టెక్కే సూచనలు కనిపించడం లేదు. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయSource: Yahoo! Telugu: News | 6 Jul 2008 | 12:16 pm ప్రైవేట్ యాజమాన్యంతో క్రికెట్‌కు ముప్పులేదు: బీసీసీఐఐపీఎల్ వంటి ట్వంటీ- 20 క్రికెట్ లీగ్‌ల్లో ప్రైవేట్ యాజమాన్యం క్రికెట్‌కు ముప్పుగా పరిణమిస్తుందనే క్రికెట్ ఆస్ట్రేలియా వాదనకు బీసీసీఐ తీవ్రంగా స్పందించింది. ప్రైవేట్ యాజమాన్యాల వలన ఆటకు ఎటువంటి ముప్పు జరగదని బీసీసీఐ స్పష్టం చేసింది.Source: Yahoo! Telugu: News | 6 Jul 2008 | 10:54 am అమర్‌నాథ్ యాత్రకు బయలుదేరిన 18వ బ్యాచ్కర్ఫ్యూ, జమ్ము- శ్రీనగర్ రహదారిపై అనేక ప్రదేశాల్లో నిరసనల మధ్య మరో బ్యాచ్ యాత్రికులు ఆదివారం అమర్‌నాథ్ బయలుదేరి వెళ్లారు. తాజాగా బయలుదేరిన బ్యాచ్‌తో కలసి మొత్తం 18 బ్యాచ్‌లు అమర్‌నాథ్ వెళ్లారు. తాజా బ్యాచ్‌లో 1718 మంది యాత్రికులుSource: Yahoo! Telugu: News | 6 Jul 2008 | 10:49 am
|