మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్

మల్ల రాజుల రాజధాని విష్ణు పూర్. పశ్చిమ బెంగాల్‌లోని బంకూర్ జిల్లాలో ఉంది విష్ణు పూర్. కళలు, సాంస్కృతిక రంగాలకు నిలయం విష్ణు పూర్. బంకూరా జిల్లా రాజధాని విష్ణు పూర్. దాదాపు వెయ్యేళ్ల క్రితం ప్రస్తుతమున్న ప్రాంతాన్ని మల్లభూమ్‌గా పిలిచేవారు. మొఘల్ సామ్రాజ్యం...
Source: వినోదం | 13 Jun 2008 | 2:16 pm

కొనసాగుతున్న కోడెల ధర్నా

ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు నిరసనతో నరసరావుపేట రగిలిపోతోంది. కోడెల ధర్నాకు మద్దతుగా కార్యకర్తలు నరసరావుపేట అన్ని మార్గాలను మూసివేసి దిగ్భందనం చేశారు. దీనితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 1:26 pm

ఆంగ్ల మాధ్యమంలో చదవండి: వసతులు ఏవండీ...?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించింది. నేటి పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావాలంటే ప్రతి విద్యార్థికి ఇంగ్లీషు పరిజ్ఞానం తప్పనిసరి అయినందువల్ల ఆరో తరగతి నుంచే ఇంగ్లీషు మాధ్యమంలో బోధనకు శ్రీకారం చుట్టింది.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 11:20 am

తెలుగు భాషకు ప్రాచీన హోదాపై కసరత్తులు

'సుందర తెలుగు'గా తమిళ ప్రముఖ కవి నుంచి ప్రశంసలు పొందిన తెలుగు భాషకు ప్రాచీన హోదా ఎండమావిగానే మారుతోంది. పొరుగున ఉన్న తమిళ భాషకు ప్రాచీన హోదాను ఆ రాష్ట్ర పాలకులు పట్టుబట్టీ మరీ సాధించుకున్నారు. అయితే మన తెలుగు భాషకు మాత్రం ఆ హోదా ఎండమావిగానే ఉంది.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 11:13 am

తెలంగాణ వాదాన్ని పార్టీ చూసుకుంటుంది: తలసాని

తెలంగాణ వాదం గురించి పార్టీ అధిష్టానం చూసుకుంటుందని టీడీపీ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేవలం తెలంగాణ వాదం పేరుతో కొందరు పార్టీని వీడిపోయే ప్రసక్తే లేదని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 10:47 am

సిలిగురిలో అప్రకటిత బంద్: షాపులు, మార్కెట్‌లు మూసివేత

పెద్ద సంఖ్యలో భద్రతా సిబ్బందిని మోహరించడంతో పశ్చిమబెంగాల్‌లోని సిలుగురి పట్టణంలో బంద్‌ను పోలిన వాతావరణం నెలకొంది. భారీ సంఖ్యలో భద్రతా సిబ్బంది గస్తీ నిర్వహిస్తుండటంతో ప్రజలు భయాందోళలకు గురైయ్యారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 10:44 am

యూపీఏ ప్రభుత్వ ఆర్థిక విధానాలపై లెఫ్ట్ పార్టీల ధ్వజం

ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో అధికార యూపీఏ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం అయిందని శుక్రవారం లెఫ్ట్ పార్టీలు ధ్వజమెత్తాయి. ధరల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం కంటితుడుపు చర్యలు మాత్రమే తీసుకుంటుందని విమర్శించాయి.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 10:29 am

అమృతోత్సవాలకు టీటీడీ ఏర్పాట్లు: కరుణాకరరెడ్డి

తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పడి డెబ్భై ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా అమృతోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్టు ఛైర్మన్ కరుణాకరరెడ్డి తెలిపారు. జూలై 7 నుంచి 10 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 10:23 am

తెలంగాణవాదం వల్ల టీడీపీకి నష్టం లేదు: కోడెల

తెలంగాణవాదం వల్ల టీడీపీకి వచ్చిన నష్టం ఏమీ లేదని ఆ పార్టీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్ వ్యాఖ్యానించారు. ఈ విషయంపై పార్టీలో ఒకరిపై ఒకరు బురద చల్లుకోవడం వల్ల లాభం లేదని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 9:52 am

వరికి వెయ్యి మద్దతు ధర ఇచ్చే వరకు ఉద్యమం: బాబు

వరికి వెయ్యి రూపాయల మద్దతు ధర ఇచ్చే వరకు తాము విశ్రమించబోమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. వరికి మద్దతు ధర కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయనున్నామని ఆయన తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 9:43 am

కేరళ నుంచి భాజపా దేశ వ్యాప్త ప్రచారం: వెంకయ్య

కర్ణాటక రాష్ట్రంలో లభించిన విజయంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని కేరళ రాష్ట్రం నుంచి శ్రీకారం చుట్టాలని కమలనాథులు నిర్ణయించారు. వచ్చే వారం నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రచారం దేశ వ్యాప్తంగా సాగుతుంది. మూడు నెలల పాటు సాగే ప్రచారాన్ని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు ప్రారంభిస్తారు.
Source: జాతీయ | 13 Jun 2008 | 9:41 am

రాజ్‌థాక్రే అరెస్టుకు జార్ఖండ్ కోర్టు నోటీసు జారీ

ముంబై నవనిర్మాణ్ సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్‌థాక్రే అరెస్టుకు జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన స్థానిక కోర్టు శుక్రవారం నోటీసు జారీ చేసింది. ఒక వర్గం వారిని కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు గాను జార్ఖండ్ రాష్ట్రంలో ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో హాజరుకావాల్సిందిగా కోర్టు గతంలో నోటీసు జారీ చేసింది.
Source: జాతీయ | 13 Jun 2008 | 9:29 am

బెంగాల్ విభజనకు కేంద్రం వ్యతిరేకం: మున్షీ

గోర్ఖాలాండ్ సమస్యపై పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముక్కలు కావడం కేంద్రానికెంత మాత్రం ఇష్టం లేదని కేంద్ర సమాచార, ప్రసార శాఖామంత్రి ప్రియరంజన్ దాస్ మున్షీ స్పష్టం చేశారు. అంతేకాకుండా డార్జిలింగ్, దాని పరిసర ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను శాంతియుతంగా పరిష్కరించేందుకు కేంద్రం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.
Source: జాతీయ | 13 Jun 2008 | 8:39 am

బెల్ట్ షాపుల రద్దు కోరుతూ టీడీపీ నేత రోజా ధర్నా

మద్యం బెల్ట్ షాపులను రద్దు చేయాలని కోరుతూ టీడీపీ నేత రోజా శుక్రవారం ధర్నాకు దిగారు. టీడీపీకి చెందిన కార్యకర్తలు, మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 8:36 am

అసిఫ్ కేసుపై ఆదివారం తీర్పు: పాక్ దౌత్యకార్యాలయం

దుబాయ్ అటార్నీ జనరల్ పాకిస్థాన్ బౌలర్ మొహమ్మద్ అసిఫ్ కేసుపై ఆదివారం తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఆదివారం అటార్నీ జనరల్ అసిఫ్ కేసు విచారణ చేపట్టనున్నట్టు పాక్ దౌత్యకార్యాలయ అధికారులు తెలిపారు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 8:36 am

రాజ్ ప్రభుత్వం-గుజ్జర్ల మధ్య కీలక చర్చలు ప్రారంభం

ఎస్టీ హోదా కోసం గత కొద్ది రోజులుగా ఆందోళనబాటలో పయనిస్తున్న గుజ్జర్ల ప్రతినిధులు, రాజస్థాన్ ప్రభుత్వ ప్రతినిధుల మధ్య కీలక చర్చలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో గత 22 రోజులుగా సాగుతున్న ఆందోళనకు తెరదించేందుకు వీలుగా ఇరు వర్గాలు ఒక నిర్ణయానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Source: జాతీయ | 13 Jun 2008 | 8:28 am

డార్జిలింగ్ వివాదం: అఖిలపక్ష సమావేశానికి పిలుపు

డార్జిలింగ్ వివాదంపై పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య ఈ నెల 17న అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. గోర్ఖా జనముక్తి మోర్చా ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ కారణంగా డార్జిలింగ్, దాని పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 8:27 am

గంభీర్ సెంచరీ: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం

ముక్కోణపు సిరీస్‌లో భాగంగా మిర్పూర్‌లో గురువారం జరిగిన వన్డేలో భారత్ ఏడు వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 107 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్ విజయానికి బాటలు వేశాడు.
Source: Yahoo! Telugu: News | 13 Jun 2008 | 8:17 am

నా అభిప్రాయం పూర్తిగా వ్యక్తిగతం: తలసాని

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర ఏర్పాటుపై తాను వ్యక్తం చేసిన అభిప్రాయం పూర్తిగా వ్యక్తిగతమని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆయన శుక్రవారం శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమలకు వచ్చారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 8:09 am

ఓటమితో గుణపాఠాలు: తెరాస అధినేత

ముగిసిన ఉప ఎన్నికల్లో ఎదురైన ఓటమితో గుణపాఠాలు నేర్చుకోవాలని తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మహబాబునగర్ జిల్లా నాగర్‌కర్నూల్ పట్టణంలో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఇందులో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 5:22 am

నెల్లూరు జిల్లాలో బంగ్లా యువకుడి అరెస్టు

నెల్లూరు జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి పాళెం మండలం నాగమాంబపురం అనే గ్రామంలో అనుమానాస్పదంగా తిరగుతున్న రఫివుల్లా ఇస్లామ్‌ను గ్రామస్థులు గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు.
Source: ఏపీ న్యూస్ | 13 Jun 2008 | 5:10 am

చిన్నగంజాంలో నారాయణ అరెస్ట్

ప్రకాశం జిల్లా చిన్నగంజాంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. అక్కడ నుంచి చీరాల జైలుకు తరలించారు.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 3:28 pm

విశాఖ 'బెల్టు'పై రోజా దాడి

తెలుగుదేశం మహిళా విభాగం అధ్యక్షరాలు ఆర్‌కే రోజా విశాఖపట్టణంలోని బెల్టు షాపులపై దాడికి దిగారు. బెల్టు షాపు నిర్వాహకులకు దేశం కార్యకర్తలకు మధ్య ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.
Source: ఏపీ న్యూస్ | 12 Jun 2008 | 2:52 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |