కాంగ్రెస్‌కు మాత్రమే ఆ హక్కు ఉంది: వైఎస్

రాష్ట్ర ప్రజల మధ్యకు వెళ్ళి ఓటు వేయమని అడిగే హక్కు ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి ప్రకటించారు. ఆయన సోమవారం హన్మకొండ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి కొండా సురేఖ తరపున ఎన్నికల ప్రచారం చేశారు.
Source: ఏపీ న్యూస్ | 26 May 2008 | 8:30 am

13 మంది పర్యాటకుల దుర్మరణం

కోయంబత్తూరు జిల్లాలో 13 మంది పర్యాటకులు జలసమాధి అయ్యారు. ఈ జిల్లాలోని ఉడుమలైపేటకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమూర్తి డామ్ సమీపంలోని పంచలింగ ఫాల్స్‌కు విహార యాత్రలో ఈ విషాదం నెలకొంది.
Source: జాతీయ | 26 May 2008 | 8:03 am

రాజస్థాన్‌లో ఆరని మంటలు: చర్చలకు నో

షెడ్యూల్ తెగల హోదా కోసం ఆందోళనపథం పట్టిన గుజ్జర్లు తమ పట్టును వీడటం లేదు. దీంతో రాజస్థాన్‌లో చెలరేగిన మంటలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. ఆందోళనకారులను అణచి వేసేందుకు ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 35కు చేరుకుంది.
Source: జాతీయ | 26 May 2008 | 5:58 am

కన్నడ కొలనులో వికసించిన కమలం

ఇకపై కన్నడనాట కషాయ పతాక రెపరెపలు కనిపించనున్నాయి. దక్షిణ భారతావనికి ప్రవేశ ద్వారంగా భావిస్తున్న కర్ణాటక రాష్ట్రంలో కమలనాథులు తొలిసారి పాగా వేశారు. విధాన సభ ఎన్నికల పరీక్షల్లో అత్తెసరు మార్కులతో పాసయ్యారు.
Source: జాతీయ | 26 May 2008 | 5:42 am

ఐఏఈఏతో భేటీ వద్దు: కేంద్రానికి లెఫ్ట్ సూచన

వచ్చే నెలలో జరుగనున్న అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) సమావేశానికి భారత్ హాజరుకారాదని లెఫ్ట్ ‌ పార్టీలు యూపీఏకు సూచించాయి. అంతేకాకుండా అణు ఒప్పందంపై యూపీఏ ఇస్తున్న సమాధానం సంతృప్తికరంగా లేదని వామపక్షాల నేతలు తేల్చి చెప్పారు.
Source: జాతీయ | 26 May 2008 | 5:29 am

నేడు కరీంనగర్‌లో తెరాస భారీ బహిరంగ సభ

కరీంనగర్ లోక్‌సభ స్థానం పరిధిలో తెలంగాణా రాష్ట్ర సమితి సోమవారం రాత్రి బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ స్థానానికి జరుగుతున్న లోక్‌సభ ఉప ఎన్నికల్లో తెరాస అధినేత కె.చంద్రశేఖర రావు పోటీ చేస్తున్న విషయం తెల్సిందే. కరీంనగర్ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి.
Source: ఏపీ న్యూస్ | 26 May 2008 | 5:09 am

స్వతంత్ర అభ్యర్థుల మద్దతుకు భాజపా మంతనాలు

తమ చిరకాల స్వప్నాన్ని నెరవేర్చుకునే ఘడియలు భారతీయ జనతా పార్టీకి దగ్గర పడ్డాయి. ఇందుకు అవసరమైన ముగ్గురు సభ్యుల మద్దతును కూడబెట్టుకునేందుకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ నేతలు చర్యలు చేపట్టారు.
Source: జాతీయ | 26 May 2008 | 4:24 am

మే 26, 2008 కార్యక్రమాలు

భారత కాలమానం ప్రకారం ఉదయం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈటీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 8.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2008 | 3:34 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 26 May 2008 | 3:13 am

సోనియా నాయకత్వానికి ఇది ఎదురుదెబ్బ: సుష్మా

కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని సోనియా గాంధీ నాయకత్వంపై ప్రజలు ఇచ్చిన తీర్పుగా ఆ పార్టీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ వర్ణించారు. దేశంలో కాంగ్రెస్ పార్టీకి ఇది 11వ పరాజయామని అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 12:17 pm

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం

దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ తొలిసారి పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. ఆదివారం వెల్లడైన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కమలనాథులు చారిత్రాత్మక విజయం సాధించారు. మొత్తం 224 సీట్లున్న కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 11:34 am

కర్ణాటక ఫలితాలే తొలి మెట్టు: భాజపా

దక్షిణభారత రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేసేందుకు కర్ణాటక విధానసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే తొలి మెట్టుగా ఆ పార్టీ నేతలు అభివర్ణించారు. ఇకపై దక్షిణ భారతావనిలో తమ పార్టీ పుంజుకుంటుందని ఆ పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు అభిప్రాయపడ్డారు.
Source: జాతీయ | 25 May 2008 | 10:39 am

28న యడ్డియూరప్ప ప్రమాణ స్వీకారం

కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా యడ్డియూరప్ప ఈనెల 28వ తేదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముగిసిన ఎన్నికల్లో ఆయన్ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా భాజపా ప్రకటించి ఎన్నికల ప్రచారం చేసిన విషయం తెల్సిందే. దక్షిణభారతావనిలి తొలి భాజపా ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించనున్నారు.
Source: జాతీయ | 25 May 2008 | 10:29 am

సోమవారం బీజేపీ శాసనసభాపక్ష సమావేశం

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన భారతీయ జనతా పార్టీ శాసనసభాపక్షం సోమవారం సమావేశం కానుంది. ఈ సమావేశం సాయంత్రం నాలుగు గంటలకు జరగుతుందని పార్టీవర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:28 am

లోక్‌సభ ఉపఎన్నికల్లో భాజపా కూటమి విజయం

పంజాబ్ రాష్ట్రంలోని అమృతసర్‌ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో శిరోమణి అకాలీదళ్-భాజపా కూటమి విజయం సాధించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్‌ రాష్ట్రంలోని హమీర్‌పూర్ లోక్‌సభ సీటుకు జరిగిన ఉప ఎన్నికల సమరంలో కూడా భాజపా గెలుపొందింది.
Source: జాతీయ | 25 May 2008 | 10:18 am

గుజ్జర్ల ఆందోళన: రాజేను కలిసేందుకు నిరాకరించిన బైంస్లా

రాజస్థాన్ రాష్ట్రంలో గుజ్జర్లు తమ వర్గానికి ఎస్టీ హోదా కోరుతూ చేపట్టిన ఆందోళనకు ఆదివారం కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఎస్టీ హోదా వివాదం పరిష్కారానికి గుజ్జర్ల నేతలను రాజస్థాన్ ప్రభుత్వం చర్చల కోసం జైపూర్ రావాలని
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:17 am

కర్ణాటక ఎన్నికలు: ఓటమిని అంగీకరించిన కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పార్టీ ప్రదర్శనపై అనేక అంశాలు ప్రభావం చూపాయని కాంగ్రెస్ తెలిపింది. తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసే మోజారిటీ వచ్చే అవకాశం లేదని కేంద్ర మంత్రి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్ చౌహాన్ ఓటమి
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 10:04 am

హర్యానా ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం

హర్యానా రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల విజయం సాధించింది. ఇటీవల కొత్తగా ఏర్పడిన హర్యానా జనహిత్ కాంగ్రెస్ (హెచ్.జె.సి) పార్టీ కొత్తగా తన ఖాతాను ప్రారంభించింది.
Source: జాతీయ | 25 May 2008 | 9:51 am

మెజారిటీ ఉన్న వారికే ప్రభుత్వం ఏర్పాటు పిలుపు

అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 100కు తక్కువ సీట్లతో సరిపెట్టుకుంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం తమకు, జేడీఎస్ పార్టీకి వస్తుందని కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సంఘ్వి పేర్కొన్నారు. బీజేపీకి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం రాకుండా
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:48 am

ప్రజా తీర్పును శిరసావహిస్తాం: కాంగ్రెస్

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. కొత్తగా కొలువుదీరే శాసనసభలో బాధ్యతాయుత ప్రతిపక్ష పార్టీగా వ్యవహరిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి, మాజీ గవర్నర్ ఎస్.ఎం.కృష్ణ ఆదివారం ప్రకటించారు.
Source: జాతీయ | 25 May 2008 | 9:28 am

మెజారిటీ రాకపోతే ప్రతిపక్షంలో కూర్చుటాం: బీజేపీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవసరమైన పూర్తి మెజారిటీ రానిపక్షంలో తాము ప్రతిపక్షం స్థానంలోనే కూర్చుంటామని బీజేపీ తెలిపింది. మెజారిటీ రాకపోతే తాము ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఇతర పార్టీల
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:27 am

గుజ్జర్ల హింసాకాండ: 37కు పెరిగిన మృతుల సంఖ్య

రాజస్థాన్‌లో గుజ్జర్ల ఎస్టీ హోదా వివాదం హింసాత్మక పరిణామాలను సృష్టిస్తోంది. గుజ్జర్ల తమ వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలని తాజాగా మొదలు పెట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకుంది. పరిస్థితిని శాంతియుతంగా పరిష్కరించే దిశగా రాజస్థాన్
Source: Yahoo! Telugu: News | 25 May 2008 | 9:21 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |