సెక్స్ అప్పీల్ ఒక్కొక్కరికీ ఒక్కో రీతిలో ఉంటుంది... దానిని ప్రదర్శించేందుకు ప్రేక్షకులను రెచ్చగొట్టే స్థాయిలో పోటీపడటం అవివేకమే. ఈ మాటలు అంటోంది ఎవరో తెలుసా. మీ స్వీట్ హార్ట్ స్నేహ.
ఇంకా ఏ మంటోందంటే... నటనా సామర్థ్యం కంటే సెక్సీగా... Source: వినోదం | 22 May 2008 | 1:48 pm
హిమాలయ పర్వతాల్లో పుట్టిన తీస్టా నది అందాల నడుమ ఉంది కాలింపాంగ్ వేసవి విడిది కేంద్రం. ఉత్తర బెంగాల్‌లో పర్వత ప్రాంత పట్టణం కాలింపాంగ్. భూటాన్ భాషలో కాలింపాంగ్ అంటే రాజు యొక్క మంత్రులకు పట్టున్న ప్రాంతం. స్థానిక గిరిజనులు వ్యవసాయ పనులు లేని... Source: వినోదం | 22 May 2008 | 1:03 pm
బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) గురువారం నష్టాల బాటలో నడిచింది. అంతర్జాతీయ మార్కెట్‌ల ప్రతికూల ప్రభావంతో 139 పాయింట్ల నష్టంతో 17,105 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం 242 పాయింట్ల తేడాతో 16,863 (కనిష్ట)- 16,105 Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 12:48 pm
తొలిసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు అధికార పీఠంపై మనుగడ సాగించలేదని రాజకీయ విశ్లేషకులు ఆదిలో భావించారు. అలాగే సుమారు 14 పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన భాజపా, సంకీర్ణ ప్రభుత్వాలను Source: జాతీయ | 22 May 2008 | 12:41 pm
ప్రజల ఆగ్రహానికి గురైతే ఎలాంటి ప్రభుత్వమైనా, ఎంతటి వారైనా తలవంచాల్సిందే. అలాంటిదే తాజాగా చోటు చేసుకుంది. రైతులకు రుణాలు ఇవ్వమని భీష్మించిన భారతీ స్టేట్ బ్యాంకు, కొత్త గ్యాస్ కనెక్షన్లు ఇవ్వబోమని మొండి వైఖరిని అవలంభించిన ఆయిల్ కంపెనీలు ప్రజల నిరసనలకు దిగొచ్చాయి. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 12:40 pm
నిధుల సమీకరణ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు ప్రభుత్వం భూములను తెగనమ్ముతోంది. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. అయితే ఈ ప్రాజెక్టుల పూర్తి కోసం కోట్లాది రూపాయల మేరకు నిధులు అవసరమవుతున్నాయి. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 12:38 pm
సాధారణంగా పక్షులు గాలిలో ఎగురుతుంటాయి. ఇది వాటి నైజం. కానీ.. నీటిలో ఉండే చేపలు గాలిలో ఎగరడం ఎపుడైనా చూశారా? నిజమే అక్కడక్కడా చూసి ఉంటాం. నీటిలో ఉండే చేపలు పైకి ఎగిరి మళ్లీ నీటిలో పడిపోతాయి. కానీ.. జపాన్‌లోని గగోషిమా Source: వినోదం | 22 May 2008 | 12:37 pm
బ్రిటన్‌లో హత్యకు గురైన విద్యార్థిని జ్యోతిర్మయి హత్య కేసుకు సంబంధించి వాదించేందుకు బ్రిటన్ లాయర్లు సిద్ధంగా ఉన్నట్టు ఎంపీ మధుయాష్కీగౌడ్ తెలిపారు. అయితే ఇందుకు ఆమె తల్లిదండ్రుల అనుమతి అవసరమని ఆయన అన్నారు. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 11:41 am
ప్రభుత్వ రంగ చమురు కంపెనీల ప్రయోజనాలను కాపాడే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తుంది. చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలను తీర్చేందుకు తీసుకోవాలనుకుంటున్న చర్యల్లో ఇంధన ధరలు పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 11:33 am
జమ్మూ- కాశ్మీర్ సమస్య పరిష్కారం కోసం పాకిస్థాన్ సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తున్న పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) గురువారం రెండు ప్రతిపాదనలు చేసింది. అందులో ఒకటి జమ్మూ- కాశ్మీర్ ప్రాంతంలో సైనికుల సంఖ్యను తగ్గించడం కాగా Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 11:23 am
ఐపీఎల్‌కు ఛీర్‌గరల్స్ ఫిర్యాదు చేసి ఉంటే తాము దానిపై విచారణ చేపడతామని బీసీసీఐ తెలిపింది. లండన్‌కు చెందిన ఇద్దరు ఛీర్‌గరల్స్ నెల రోజుల కిందట తాము జాతి వివక్షను ఎదుర్కొన్నామని ఆరోపించారు. దీనిపై వాళ్లు అధికారికంగా ఫిర్యాదు చేస్తే Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 11:07 am
ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన వారిపై ప్రచారంలో పాల్గొనేందుకు వీలు లేకుండా నిషేధం విధించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 10:58 am
జమ్మూ- కాశ్మీర్‌లో పౌర హత్యలు గణనీయంగా తగ్గాయని ఆ రాష్ట్ర పోలీసులు చెప్పారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది తీవ్రవాదుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య మూడు రెట్లు తగ్గిందని పోలీసులు గురువారం వెల్లడించారు. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 10:52 am
ఆఫీస్‌లో ఓ అధికారి తన దిగువ స్థాయి ఉద్యోగిని చూసి...
మేనేజర్: నేను మేనేజర్‌నే. అంతమాత్రాన అందరి పనిని నేనే మోయాలంటే ఎలా?
రాముః అవును సార్. అందరి నిద్రను మీరే చేయాలంటే చాలా కష్టమే... Source: వినోదం | 22 May 2008 | 10:15 am
ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు ఇద్దరు మంత్రులు హోం మంత్రి జానారెడ్డి, భారీ నీటిపారుదల శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్యలకు ఎన్నికల కమిషన్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 10:11 am
సీపీఎం వృద్ధ నేత హరికిషన్ సింగ్ సుర్జీత్ ఆరోగ్యం కాస్త మెరుగుపడిందని ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. కోమా నుంచి సుర్జీత్ బయటకు వచ్చినట్టు వైద్యులు గురువారం తెలిపారు. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 10:11 am
పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన జీవితాశయమని తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 'మీ కోసం' యాత్రలో భాగంగా ఆయన గురువారం అదిల్లాబాద్ జిల్లాలో పర్యటించారు. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 10:07 am
ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు తెరాస చీఫ్ కేసీఆర్ అడ్డుగా ఉన్నారని తెరాస(ఎన్) అధినేత నరేంద్ర ఆరోపించారు. ఆయన ప్రదర్శిస్తున్న స్వార్థ పూరిత రాజకీయాల కారణంగా తెలంగాణ ఏర్పాటు జాప్యం జరుగుతోందని విమర్శించారు. Source: Yahoo! Telugu: News | 22 May 2008 | 9:02 am
వచ్చే ఎన్నికల్లో మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తామని చెప్పిన మీరు ఏ ఒక్క సీటు ఆశించకనే తెరాసకు మద్దతు ప్రకటించడమేంటి? ఇలా ఇస్తే ఆ పార్టీ మిమ్మల్ని బలహీనులుగా భావించదా? ఫర్వాలేదులే అనుకుంటున్నారా? తెలంగాణాలో ఎటూ మీరు అధికారంలోకి రాలేరు. ఇక తెలంగాణాకు... Source: వినోదం | 22 May 2008 | 8:38 am
రాష్ట్రంలో ఉప ఎన్నికల జరుగనున్న నియోజకవర్గాల్లో ఎన్నికల నియమావళిని పకడ్బంధీగా అమలు చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ను ఏమాత్రం ఉల్లంఘించిన ఎన్నికల సంఘం తక్షణం స్పందిస్తూ.. నోటీసు జారీ చేస్తోంది. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 8:26 am
పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమయ్య పేరుతో రాష్ట్రంలో ఒక మండలం ఏర్పాటు కానుంది. కడప జిల్లాలోని రాజంపేట రూరల్ మండలాన్ని అన్నమయ్య మండలంగా పేరు మార్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి సుముఖత వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 8:14 am
ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి తన సొంత జిల్లా కడపలో రెండు రోజుల పర్యటనకు గురువారం నుంచి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లను అధికార యంత్రాంగం ఆగమేఘాల మీద పూర్తి చేసింది. ఈ పర్యటన సమయంలో ఆయన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తారు. Source: ఏపీ న్యూస్ | 22 May 2008 | 8:00 am
పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ పలు చోట్ల విజయం సాధించింది. ప్రధానంగా నందిగ్రామ్, సింగూర్ పంచాయతీలతో పాటు.. ఈస్ట్ మిడ్నాపూర్, సౌత్ 24 పార్గణాస్ జిల్లా పరిషత్ సీట్లను తృణమూల్ కాంగ్రెస్ గెలుచుకుంది. Source: జాతీయ | 22 May 2008 | 7:35 am
కర్ణాటక విధాన సభకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా గురువారం ఆఖరి దశ పోలింగ్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. మొత్తం ఎనిమిది జిల్లాల్లోని 69 స్థానాల్లో మూడో విడత పోలింగ్ జరుగుతోంది. Source: జాతీయ | 22 May 2008 | 4:12 am
భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 08.45 గంటలకు టెలిషాపింగ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 22 May 2008 | 3:17 am
పశ్చిమ బెంగాల్ పంజాయితీ ఎన్నికల్లో నందిగ్రామ్, సింగూర్‌లను ప్రతిపక్ష తృణమూల్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది. తూర్పు మిడ్నాపూర్ జిల్లా పరిషత్‌లోని మొత్తం 53 స్థానాలు ఉండగా, 32 సీట్లను తృణమూల్ కైవసం చేసుకోవటంతో వామపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. Source: జాతీయ | 21 May 2008 | 3:33 pm
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గర్హ్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 21 మంది ప్రయాణీకులు ప్రాణాలు కోల్పోయారు. పితోర్‌గర్హ్ నుంచి బాగేశ్వర్‌కు 30 మంది ప్రయాణీకులతో వెళుతున్న బస్సు మార్గమధ్యంలో చోర్డ్‌హురిలీ వద్ద 300 అడుగుల గోతిలో పడింది. Source: జాతీయ | 21 May 2008 | 3:32 pm