మార్కెట్‌లో లాభాలు: సెన్సెక్స్ 405 పాయింట్ల వృద్ధి

బాంబే స్టాక్ ఎక్ఛ్సేంజ్ (బీఎస్ఈ) శుక్రవారం లాభాల బాటలో పయినించింది. 61 పాయింట్ల వృద్ధితో 16,782 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్ అనంతరం టెలికాం, ఫైనాన్స్ వాటాల కొనుగోలుతో రోజు మొత్తం లాభాల బాటలోనే నిలిచింది.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 12:12 pm

చినాబ్ నదిపై వంతెనను జాతికి అంకితమిచ్చిన ప్రధాని

దేశంలోనే అత్యంత పొడవైన కాంటీలీవర్ బ్రిడ్జిని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుక్రవారం ప్రారంభించారు. జమ్మూ- కాశ్మీర్ రాష్ట్రంలోని అఖ్నూర్‌లో చినాబ్ నదిపై ఈ వంతెన నిర్మించబడింది. న్యూఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో జమ్మూ విమానాశ్రయానికి
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 11:41 am

ప్రజలను గందరగోళంలోకి నెట్టొద్దు: మన్మోహన్ సింగ్

లెఫ్ట్ పార్టీల నేతలతో శుక్రవారం ఉదయం సమావేశం అనంతరం ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ ధరల పెరుగుదల విషయంపై ప్రజల్లో గందరగోళం సృష్టించవద్దని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 11:24 am

దాసరితో చిత్రాలు తీసిన నిర్మాతలకు వంశీచే 4న సత్కారం

మాజీ కేంద్ర మంత్రి, దర్శకరత్న దాసరి నారాయణరావుతో చిత్రాలు నిర్మించిన నిర్మాతలను వంశీ అంతర్జాతీయ సాంస్కృతిక సేవా సంస్థ ఆధ్వర్యంలో మే4న సత్కరించనున్నారు. రవీంద్రభారతిలో జీవీఎస్ రాజు అధ్యక్షతన దీనికి సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:40 am

సరబ్‌జీత్‌కు మరణశిక్ష తొలగిపోయే అవకాశం

పాకిస్థాన్ ప్రభుత్వం దేశంలో ప్రస్తుతం మరణశిక్ష ఎదుర్కోబోతున్న ఖైదీలందరి శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చే ప్రతిపాదనను నిశితంగా పరిశీలిస్తోంది. పాక్ ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంటే త్వరలో పాక్‌లో ఉరిశిక్షను ఎదుర్కోబోతున్న
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:34 am

వచ్చే ఏడాది నుంచి పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ తరహాలో వచ్చే ఏడాది నుంచి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ పేరుతో ఓ దేశవాళీ ట్వంటీ- 20 టోర్నీని నిర్వహించే యోచనలో ఉంది. ఐపీఎల్‌లో మాదిరిగా నగరాల ఫ్రాంచైజీలను స్పాన్సర్లకు, కంపెనీలకు
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:24 am

నేపాల్ అధ్యక్ష పదవిపై ప్రచండ ఆసక్తి

నేపాల్ అధ్యక్ష పదవి చేపట్టాలన్నదే తన చిరకాల కోరికని మావోయిస్టు నాయకుడు ప్రచండ ఉద్ఘాటించారు. ఇటీవల నేపాల్‌లో జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (మావోయిస్టు)కు నేతృత్వం వహించిన ప్రచండ తాను
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 10:22 am

విశ్వసనీయత లేని బాబు మాటలు: వైఎస్

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న వ్యాఖ్యలకు, చెపుతున్న మాటలకు ఏమాత్రం విశ్వసనీయత లేదని ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర రెడ్డి జోస్యం అన్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 9:59 am

ఉప ఎన్నికల్లో సైకిల్ ఎక్కనున్న సీపీఎం..!

ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీతో చేతులు కలిపేందుకు సీపీఎం రాష్ట్ర శాఖ నేతలు సిద్ధమయ్యారు. ఈ మేరకు తెదేపా-సీపీఎం పార్టీల మధ్య పొత్తు ఖరారైనట్టు తెలుస్తోంది. ఉప ఎన్నికల వరకు మాత్రమే ఈ పొత్తును పెట్టుకోవాలని సీపీఎం నేతలు భావిస్తున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 9:44 am

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి యత్నం: జూపూడి ఖైదు

తన ఆందోళనలో భాగంగా రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించే యత్నం చేయడంతో మాలమహానాడు అధ్యక్షుడు జూపూడి ప్రభాకరరావు సహా కార్యకర్తలను పోలీసులు శుక్రవారం ఉదయం ఖైదు చేశారు. వర్గీకరణ విషయంలో మందకృష్ణ మాదిగ బెదిరింపులకు ప్రభుత్వం లొంగిపోతోందని...
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 9:27 am

ఉప ఎన్నికల ప్రచారంలో ధర్మపురి

రాష్ట్రంలో జరుగనున్న ఉప ఎన్నికల కోసం ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 8:47 am

భారత మహిళా హాకీ జట్టు కూడా ఒలింపిక్స్‌కు దూరం

భారత హాకీ ఒలింపిక్స్ ఆశలకు మహిళల కూడా గండి కొట్టారు. క్వాలిఫైయింగ్ టోర్నీలో గురువారం అమెరికా చేతిలో 4-0తో భారత మహిళల జట్టు పరాజయం పాలై ఈ ఏడాది బీజింగ్‌లో జరిగే ఒలింపిక్స్‌కు దూరమైంది.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 8:45 am

ప్రధానితో లెఫ్ట్ నేతల భేటి: ధరల నియంత్రణకు డిమాండ్

ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌తో శుక్రవారం లెఫ్ట్ పార్టీల నేతలు భేటి అయ్యారు. పార్లమెంట్‌లో ఆర్థిక బిల్లు మరో 24 గంటల్లో ప్రవేశపెట్టనుండగా లెఫ్ట్ నేతలు ప్రధానితో సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Source: Yahoo! Telugu: News | 25 Apr 2008 | 8:01 am

వివిధ రోడ్డు ప్రమాదాల్లో 10 మంది మృతి

రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం జరిగిన పలు రోడ్డు ప్రమాదాల్లో పది మంది దుర్మరణం పాలయ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 25 Apr 2008 | 8:01 am

పది ఉపగ్రహాలతో కోట నుంచి 28న రాకెట్

పది ఉపగ్రహాలతో కూడిన పీఎస్‌ఎల్‌వీ రాకెట్‌ను శ్రీహరి కోట నుంచి ఏప్రిల్ 28న ప్రయోగించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఉదయం 9.23 గంటలకు వాటిని ప్రయోగించాలని భావిస్తున్నారు.
Source: జాతీయ | 24 Apr 2008 | 12:49 pm

కుబేరులు రెండో షెడ్యూల్

శివాజీ, కృష్ణభగవాన్, ఆలీ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం కుబేరులు. ఈ చిత్రం రెండో షెడ్యూల్ హైదరాబాద్‌లోని రాక్‌కాజిల్‌లో జరుగుతోంది. పేరుకు కుబేరులే గాని వారికి అన్నీ అప్పులే అనేది క్యాప్షన్‌గా చేర్చినట్లు దర్శకుడు వివరించారు...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2008 | 12:03 pm

ఆఖరి షెడ్యూల్‌లో రైన్‌బో

శ్రీసిద్ధార్ధ మూవీస్ పతాకంపై భరత ఆర్ట్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న రైన్‌బో చిత్రం వీఎన్ ఆదిత్య నిర్మాణ, దర్శకత్వంలో రూపొందుతోంది. రాహుల్, సోనాల్ చౌహాన్, సింధూమీనన్‌లు హీరోహీరోయిన్‌లుగా నటిస్తున్నారు. పరుచూరి బ్రదర్స్ మాటలను సమకూర్చారు...
Source: Yahoo! Telugu: Entertainment | 24 Apr 2008 | 11:56 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |