రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 అసెంబ్లీ, నాలుగు లోక్‌సభ నియోజకవర్గాలకు వచ్చే నెల 29వ తేదీన ఉప ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణా రాష్ట్ర సమతి (తెరాస) వల్ల నాలుగు లోక్‌సభ స్థానాలకు ఖాళీ ఏర్పడగా, ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 11:09 am
కొత్తగా ప్రవేశపెట్టిన రూ.2కే కిలో బియ్యం పథకం కాంగ్రెస్ మేనిఫెస్టోలో లోదని ఆ పథకాన్ని తమ పార్టీనే ప్రారంభించిదని టీడీపీ నేత నందమూరి హరికృష్ణ తెలిపారు. దీనిని ఎన్నికల ఆయుధంగా కాంగ్రెస్ ఉపయోగించుకుంటోందని విమర్శించారు. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:58 am
ఏప్రిల్ 20న జరుగనునన్న గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను పంపించేశారు. హాల్‌టికెట్లు లభించని వారు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీపీఎస్‌సి.-ఏపీ.ఎన్‌ఐసి.ఇన్ వెబ్‌సైట్‌లో నుంచి డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించారు. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:57 am
రోజురోజుకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎంఎంఎస్ సేవలను, వాటి బోగీల సంఖ్యను పెంచనున్నట్టు సికింద్రాబాద్ రైల్వే మేనేజర్ శరద్ ఇంగ్లే తెలిపారు. ఇక్కడ ఇప్పటికే ఉన్న రైల్వే రిజర్వేషన్లతో పాటు ఏటీఎంలను కూడా ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:55 am
కందుకూరి వీరేశలింగం జన్మదినం బుధవారం కావడంతో ట్యాంక్‌బండ్‌పై ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ప్రముఖులు, కళాకారులు ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన జన్మదినాన్ని తెలుగు నాటకరంగ దినోత్సవంగా... Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:53 am
అఖిల భారత 15వ పద్మశాలి మహాసభలను హైదరాబాద్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 10, 11 తేదీలలో వీటిని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అఖిల భారత పద్మశాలి మహాసభ ఆహ్వాన సంఘ అధ్యక్షురాలు చిలువేరి... Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:51 am
నేపాల్‌లో గతవారం జరిగిన చారిత్రాత్మక ఎన్నికల్లో అనూహ్య విజయం సాధించిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్- మావోయిస్టు చీఫ్ ప్రచండ ఈ విజయంపై వేడుకలు జరపుకునే తీరికలేకుండా గడుపుతున్నారు. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 10:24 am
తెలుగుదేశం పార్టీ మరోసారి మాహానాడు పేరిట పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ఈ మహానాడుకు ఉత్తరాంధ్రలోని విశాఖపట్నంను వేదికగా ఎంచుకుంది. విశాఖలో తెదేపా మాహానాడు జరగడం ఇది మూడోసారి కావడం గమనార్హం. Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 10:20 am
మెగాస్టార్ చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం వల్ల తమకెలాంటి నష్టం వాటిల్లబోదని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. Source: ఏపీ న్యూస్ | 16 Apr 2008 | 7:49 am
ఒలింపిక్ జ్యోతి ప్రపంచయాత్రలో భాగంగా ఏప్రిల్ 17న న్యూఢిల్లీ వస్తున్న నేపధ్యంలో ఆ రిలేలో భారత క్రికెట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పాల్గొనే అవకాశాలు లేవని క్రీడావర్గాలు వెల్లడించాయి. గజ్జల్లో గాయం కారణంగా ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన... Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:37 am
ఎన్నికల సంఘం బుధవారం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించింది. మూడు దశల్లో జరిగే ఈ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నోటిఫికేషన్ ఈసీ ఈరోజు జారీ చేసింది. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:32 am
టిబెటియన్ ఆందోళనకారులు దేశ రాజధానిలో ఉన్న చైనా ద్యౌత్యకార్యాలయంలోకి చొరబడేందుకు మరోసారి ప్రయత్నించారు. గురువారం భారత్‌లో బీజింగ్ ఒలింపిక్ టార్చ్ రిలే జరగనున్న నేపథ్యంలో ముందురోజు టిబెటియన్లు చైనా Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:18 am
గన్నవరం విమానాశ్రయాన్ని విస్తరించేందకు రైతుల నుంచి సేకరించిన భూమికి అదనపు పరిహారం చెల్లించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 1989లో విమానాశ్రయ విస్తరణ కోసం రైతుల నుంచి భూమిని సేకరించిన విషయం తెలిసిందే. Source: Yahoo! Telugu: News | 16 Apr 2008 | 7:17 am
పార్లమెంటుపై దాడి కేసులో ప్రధాన ముద్దాయిగా తేలిన మొహ్మద్ అఫ్జల్ దాఖలు చేసుకున్న క్షమాభిక్ష పటీషన్‌ను భారతీయ జనతా పార్టీ రాజకీయం చేస్తోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి షకీల్ అహ్మద్ ఆరోపించారు. Source: జాతీయ | 16 Apr 2008 | 5:14 am
కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి పదవి ప్రస్తుతానికి ఖాళీగా లేదని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. అందువల్ల ఆ పోస్టు అభ్యర్థిత్వంపై చర్చ జరపాల్సిన అవసరం లేదని ఆ పార్టీ అధికార ప్రతినిధి జయంతీ నటరాజన్ హితవుపలికారు. Source: జాతీయ | 16 Apr 2008 | 4:37 am
గుజరాత్ రాష్ట్రంలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కనీసం 50 మంది విద్యార్థులతో కూడిన పాఠశాల బస్సు నర్మదా నది కాలువలో బోల్తా పడింది. ప్రాథమిక సమాచారం మేరకు నలభై మందికి పైగా మృతి చెందగా, ఐదుగురు ప్రాణాలతో బయటపడ్డారు. Source: జాతీయ | 16 Apr 2008 | 4:10 am
భారత కాలమానం ప్రకారం 05.30 గంటలకు భక్తి గీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవీ న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలీవుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా Source: Yahoo! Telugu: Entertainment | 16 Apr 2008 | 3:50 am
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన లగాన్ సినిమాకు సంబంధించి కాపీరైట్ ఉల్లంఘన కేసులో సాక్ష్యం ఇవ్వాలని ఆదేశిస్తూ ఆ చిత్ర నిర్మాత, బాలీవుడు నటుడు అమీర్‌ఖాన్‌ను ఢిల్లీ కోర్టు మంగళవారం సమన్లు పంపింది. Source: జాతీయ | 15 Apr 2008 | 1:48 pm