రాజ్యాంగ నిర్మాత డా.బిఆర్. అంబేద్కర్ 118వ జయంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాజ్యాంగ రూపకల్పనలో కీలకపాత్ర వహించి.. జాతికి అంబేద్కర్ ఎనలేని సేవ చేశారని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రశంసించారు. Source: ఏపీ న్యూస్ | 14 Apr 2008 | 12:07 pm
నేపాల్‌లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ దేశ మాజీ మావోయిస్టులు విజయం సాధించడం అభివృద్ధికి సానుకూలమైనదని భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ వెల్లడించారు. ప్రజాస్వామ్య ప్రక్రియలో మావోయిస్టులు అద్భుతవిజయాన్ని సాధించారని పేర్కొన్నారు. Source: జాతీయ | 14 Apr 2008 | 6:10 am
ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించని ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్రముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వెల్లడించారు. బ్యాంకు రుణాలను క్రమం తప్పకుండా చెల్లించిన రైతులకు తప్పక న్యాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. Source: ఏపీ న్యూస్ | 14 Apr 2008 | 5:34 am