ముఖ్యమంత్రి వైఎస్ ప్రధాన పాత్రలో చిత్ర నిర్మాణం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యపాత్రలో త్వరలో ఓ చిత్రం రూపొందనుంది. ముఖ్యమంత్రి సన్నిహితుడైన సీసీ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. విసుఫిలింస్ ద్వారా గతంలో గౌతమ్ ఎస్.ఎస్.సి, మీ శ్రేయోభిలాషి చిత్రాలను సీసీ రెడ్డి నిర్మించారు.
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2008 | 11:28 am

ప్రత్యేక తెలంగాణా సాధిస్తాం: కేసిఆర్

ప్రత్యేక తెలంగాణా సాధించేవరకూ తాము విశ్రమించబోమని తెలంగాణా రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావు ఉద్ఘాటించారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడితే నక్సలైట్లతో చర్చలు జరుపుతామని తెలిపారు. కేసిఆర్ బహిరంగ సభలో చేసిన ప్రసంగాన్ని వీడియోలో వీక్షించండి.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2008 | 10:13 am

విశాఖకు ఇక ప్రతి రోజూ ఎయిర్ ఇండియా విమాన సేవ

విశాఖకు ఇక ప్రతి రోజూ విమాన సేవ నడుపనున్నట్టు ఎయిర్ ఇండియా తెలిపింది. ఇప్పటివరకు వారానికి ఆరు రోజులు మాత్రమే నడుపుతూ వచ్చిన విమాన సేవలను ఇకపై ప్రతిరోజూ నడపాలని నిర్ణయించామని వెల్లడించింది.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 9:50 am

పవన్ అభిమానులకు జల్సా

పవన్‌కళ్యాణ్ హీరోగా ఇలియానా, కమిలినీముఖర్జీ, పార్వతీమెల్టన్ హీరోయిన్లుగా త్రివ్రిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన జల్సా చిత్రం పవన్‌కళ్యాణ్ అభిమానులకు నిజంగా జల్సాలాంటిదే. చాలాకాలం తర్వాత పవన్‌కళ్యాణ్ గ్లామర్‌గా, ఎనర్జిటిక్‌గా నటించిన ఈ చిత్రం చిత్రీకరణ...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2008 | 9:46 am

గ్యాస్ పైప్‌లైన్‌పై పాక్, ఇరాన్‌తో చర్చలు: డియోరా

భారత్, పాకిస్థాన్, ఇరాన్ దేశాల మధ్య నిర్మించ తలపెట్టిన గ్యాస్ పైప్‌లైన్ గురించి చర్చించడానికి సమావేశం నిర్వహించనున్నట్టు కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి మురళి డియోరా తెలిపారు. ఇందుకోసమై ఎప్రిల్ 23న పాకిస్థాన్, ఇరాన్‌లకు చెందిన ఉన్నతాధికారులతో...
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 9:41 am

ఎస్సై పోస్టులకు వయో పరిమితి పెంచడం కుదరదు

ఎస్సై పోస్టులకు వయో పరిమితి పెంచడం సాధ్యపడదని ముఖ్యమంత్రి వైఎస్ స్పష్టం చేశారు. దీనికి పలు కారణాలు ఉన్నాయని ఆయన చెప్పారు. వయసు దాటిన వారిని ఎస్సై పోస్టులకు తీసుకుంటే పలు రకాల సమస్యలు తలెత్తగలవన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 9:27 am

ఏప్రిల్ 11న రానున్న భలేదొంగలు

తరుణ్, ఇలియానా జంటగా నటిస్తోన్న చిత్రం భలేదొంగలు. కె. విజయభాస్కర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో ఛార్మీ ఓ ప్రత్యేక పాటలో అలరించనుంది. ఇన్ని విశేషాలు కలిగిన ఈ చిత్రాన్ని...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2008 | 9:20 am

జింబాబ్వే ఎన్నికల ఫలితాల కోసం కోర్టుకెక్కిన ప్రతిపక్ష పార్టీ

జింబాబ్వేలో ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలంటూ ఆ దేశ ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఎమ్‌డీసీ కోర్టుకెక్కింది. ఓట్ల లెక్కింపు పూర్తయినా ఫలితాలను అధికారికంగా ప్రకటించక పోవడాన్ని సవాలు చేస్తూ ఆ పార్టీ హైకోర్టులో కేసు దాఖలు చేసింది.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 9:06 am

కర్ణాటక ఎన్నికల వరకు హొగినేకల్ వాయిదా: కరుణానిధి

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకు హొగినేకల్ ప్రాజెక్టు వివాదాన్ని తాత్కాలికంగా వాయిదా వేయనున్నట్టు తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి పేర్కొన్నారు. హొగెనేకల్ పేరుతో కర్ణాటకలో హింస చెలరేగడం తనకు ఇష్టంలేదని ఆయన...
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 8:46 am

జగ్జీవన్‌రామ్ జయంతిః వైఎస్, బాబు సహా నేతల నివాళి

మాజీ ఉప ప్రధాని జగ్జీవన్‌రామ్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ముఖ్యమంత్రి వైఎస్, టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా పలువురు నేతలు నివాళులు అర్పించారు. బషీర్ బాగ్‌లోని ఆయన శిలా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 8:43 am

కాకినాడ ఆస్పత్రిలో ఖాకీ కాల్పులు

విధి నిర్వహణలో ఉన్న పోలీసు కానిస్టేబుల్ విచక్షణారహితంగా శనివారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు ఆస్పత్రి సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.
Source: ఏపీ న్యూస్ | 5 Apr 2008 | 6:41 am

అహ్మదాబాద్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్: 95/3

అహ్మదాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో భారత్ ఓటమి దిశగా అడుగులేస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 76 పరుగులకే చేతులెత్తేసిన భారత బ్యాట్స్‌మెన్ రెండో ఇన్నింగ్స్‌లోను పెవిలియన్‌కు క్యూ కట్టారు. కేవలం 70 పరుగులకే మూడు వికెట్లు...
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 6:17 am

చెన్నైలో శ్రీనివాస కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు

చెన్నైలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించే శ్రీనివాస కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. సినీ కళాదర్శకుడు తోట తరణి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలకు హంగులు సమకూరుస్తున్నారు. గత పర్యాయం కోయంబేడులో నిర్వహించిన ఉత్సవానికి ఒకటిన్నర...
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 6:03 am

పాక్ సందర్శించే భారతీయులకు వీసా మినహాయింపు: షరీఫ్

భారతీయులు వీసా లేకుండా పాకిస్థాన్‌ను సందర్శించేందుకు వీలు కల్పించేలా చర్యలు తీసుకోనున్నట్టు పీఎంఎల్-ఎన్ అధ్యక్షడు నవాజ్ షరీఫ్ తెలిపారు. సంకీర్ణ ప్రభుత్వంలో తాము భాగస్వామ్యం వహిస్తున్నందున ఇందుకోసం కృషి చేస్తామని ఆయన అన్నారు.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 5:48 am

మూడు క్యాటగరీలుగా రాజధానిలో ప్రభావిత పన్ను వసూలు

రాజధానిలో ప్రభావిత పన్నును మూడు కేటగరీలుగా విభజించి వసూలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఆయా కేటగరీలను బట్టి చదురపుటడుగుకు రూ. 400 (ఏ కేటగరీ), రూ.300 (బి కేటగరీ), రూ. 200 (సీ కేటగలీ)లను ప్రభావిత పన్నుగా వసూలు చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 5 Apr 2008 | 4:51 am

ఏప్రిల్ 05, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.30 గంటలకు ప్రత్యేక కార్యక్రమం, 9.15 గంటలకు టాలీవుడ్ టైం, 10.00 గంటలకు షో రీల్...
Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2008 | 3:10 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 5 Apr 2008 | 3:07 am

ప్రేమబంధం ప్లాటినం డిస్క్ వేడుక

ఆకాష్ హీరోగా అగస్త్యన్ దర్శకత్వంలో రూపొందిన ప్రేమబంధం ప్లాటినం డిస్క్ వేడుక గురువారం రాత్రి హైదరాబాద్‌లోని మినీఓడియన్ థియేటర్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ, నా కెరీర్‌లో మంచి సినిమా చేసిన సంతృప్తి ఈ చిత్రమిచ్చింది.
Source: Yahoo! Telugu: Entertainment | 4 Apr 2008 | 1:07 pm
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |