లాభాలతో ముగిసిన మార్కెట్: సెన్సెక్స్ 356 పాయింట్ల వృద్ధి

శుక్రవారం స్టాక్ మార్కెట్ లాభాలతో ముగిసింది. దీంతో బాంబే స్టాక్ మార్కెట్ ఎక్సెంజీ సూచి సెన్సెక్స్ 356 పాయింట్ల లాభపడి 16371 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే నేషనల్ స్టాక్ ఎక్సేంజీ సూచి నిప్టీ సైతం 112 పాయింట్లు లాభపడి 4942 పాయింట్ల వద్ద ముగిసింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 11:01 am

అవిశ్వాస తీర్మానంపై 31న చర్చః ఏప్రిల్ 1న ఓటింగ్

రాష్ట్ర ప్రభుత్వంపై టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై మార్చి 31న చర్చ జరుగనుంది. సభా వ్యవహారాల సంఘం శుక్రవారం సమావేశమై ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకుంది. టీడీపీ దీనికోసం గురువారం సభా వ్యవహారాల కార్యదర్శికి నోటీసు ఇచ్చింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 10:25 am

భూ పంపిణీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా లెఫ్ట్ వాకౌట్

భూ పంపిణీపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా వామక్షాలు వాకౌట్ చేశాయి. భూముల పంపిణీ అక్రమాల మయంగా మారిందని ఆరోపించాయి. తాము భూపోరాటాల ద్వారా ప్రభుత్వానికి నివేదించినా ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని తెలిపాయి.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 10:06 am

టీడీపీ ద్వారా తెరాస ఓటమికి వైఎస్ కుట్రః కేసీఆర్

త్వరలో జరిగే ఉపఎన్నికల్లో తమ పార్టీ ఓటమికి ముఖ్యమంత్రి వైఎస్ కుట్రపన్నుతున్నారని తెరాస చీఫ్ కేసీఆర్ ఆరోపించారు. తమను ఓడించేందుకై చివరకు టీడీపీతో సైతం జట్టు కట్టే స్థాయికి వైఎస్ దిగజారారని దుయ్యబట్టారు.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 10:00 am

ప్రధాని కార్యాలయం సమీపంలో మిస్‌ఫైర్: కమెండోకు గాయాలు

ప్రధాని కార్యాలయానికి సమీపంలోని సౌత్‌బ్లాక్‌లో శుక్రవారం ఓ కానిస్టేబుల్ చేతిలోని తుపాకీ మిస్‌ఫైర్ అయ్యింది. ఈ సంఘటనలో ఓ కమెండోకు తీవ్రగాయాలయ్యాయి.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 9:42 am

కొత్తగా 4 ఐఐటీలు, 6 ఐఐఎమ్ఎస్‌ల ఏర్పాటుకు సన్నాహాలు

వివిధ రాష్ట్రాల్లో నాలుగు ఐఐటీలు, ఆరు ఐఐఎమ్ఎస్‌లను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే కొన్ని రాష్ట్రాల్లోని యూనివర్శిటీలను కేంద్రీయ విశ్వవిద్యాలయాల స్ధాయి హోదా ఇవ్వడానికి కూడా సంకల్పించింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 9:30 am

పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 1.25కోట్లతో సరికొత్త ఎకో కోచ్‌లు

పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో రూ. 1.25కోట్లతో సరికొత్త ఎకో కోచ్‌లు ఏర్పాటు చేశారు. అటోమేటిక్ టాయిలెట్లతో కూడిన కోచ్‌లను ఏర్పాటు చేసిన రైలు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు చెన్నై బయలుదేరి వేళ్లింది. ఈ సదుపాయం కారణంగా రైల్వేస్టేషన్లలో దుర్గంధం వెదజల్లదని...
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 9:21 am

సెహ్వాగ్ డబుల్ సెంచరీః చెన్నైలో కొనసాగుతున్న భారత్ జోరు

దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడిన వీరేంద్ర సెహ్వాగ్ డబుల్ సెంచరీ చేయడం ద్వారా చెన్నై టెస్టులో భారత్ జోరును కొనసాగిస్తున్నాడు. తాజా వార్తల ప్రకారం భారత్ ఓ వికెట్టు నష్టానికి 292 పరుగులు చేసింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 8:46 am

వేణు, సుహాసిని జంటగా తమాషా చూద్దాంరండి

పాతతరం నటుడు నరశింహరాజు నిర్మాణ సారథ్యంలో అశోక్‌రావు దర్శకత్వంలో తమాషా చూద్దాంరండి అనే చిత్రం రూపొందుతోంది. వల్లభనేని పూర్ణచంద్రరావు, సత్యనారాయణలు ఈ చిత్రానికి నిర్మాతలు. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 8:33 am

సమస్యలకు దర్పణం పట్టే బ్లాక్ అండ్ వైట్

ప్రజా జీవితంలో నిత్యం ఎదురయ్యే సమస్యలకు దర్పం పట్టే విధంగా తమ బ్లాక్ అండ్ వైట్ చిత్రం రూపొందుతోందని చిత్ర దర్శకుడు శ్రాకాంత్ వేములపల్లి తెలిపారు. నిత్యం ఎదురయ్యే ఓ సమస్యకు దృశ్య రూపమే ఈ చిత్రమని ఆయన పేర్కొన్నారు.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 7:45 am

హ్యాపీడేస్ నిఖిల్ హీరోగా అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్

హ్యాపీడేస్ ఫేం నిఖిల్ హీరోగా హరి ఎల్లేటి దర్శకత్వంలో జక్కంపూడి వెంకటేష్ నిర్మతగా రూపొందుతున్న చిత్రం అంకిత్, పల్లవి అండ్ ఫ్రెండ్స్. ఓ పాట మినహా ప్రస్తుంతం ఈ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది.
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 7:32 am

కాశ్మీర్‌లో గ్రామీణ అందాల కోసం రూ.1200 కోట్లు

కాశ్మీర్‌లోని గ్రామీణ ప్రాంత అందాలకు మరిన్ని సొబగులు కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం రూ.1200 కోట్లతో ఒక బృహత్తర ప్రణాళికను అమలు చేయనుంది. వచ్చే ఏప్రిల్ నుంచి అమలయ్యే ఈ పథకం వివరాలను జమ్మూకాశ్మీర్...
Source: జాతీయ | 28 Mar 2008 | 7:16 am

తెరాస రద్దు కోసం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు

తెరాసను రద్దు చేయాలని కోరుతూ సుప్రీం కోర్టులో గురువారం పిటిషన్ దాఖలైంది. పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరుకు చెందిన న్యాయవాది, ఏపీ యునైటడ్ లాయర్స్ ఫ్రంట్ అధ్యక్షుడు రోనాల్డ్ రాజ్, రాష్ట్ర దళిత సంఘం నేత బెజ్జం రాజేష్ పుత్రలు ఈ పిటిషన్ దాఖలు చేశారు.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 7:02 am

సంతోషమే నా గ్లామర్ రహస్యం: సిమ్రాన్

సామాన్యంగా చిత్ర పరిశ్రమలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించే వారికి అక్క, వదిన, అమ్మమ్మ, ఆంటీ వంటి పాత్రలు లభిస్తాయి. సిమ్రాన్ మాత్రం ఇందుకు అతీతం. ఆమె వివాహ జీవితానంతరం అమ్మగా మారిపోయింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించింది....
Source: వినోదం | 28 Mar 2008 | 6:48 am

కాళిదాసుగా సుశాంత్: అక్కినేని ఆశీర్వచనాలు

కాళిదాసు చిత్రంతో హీరోగా తెరకు పరిచయం అవుతున్న మనవడికి తాత అక్కినేని నాగేశ్వరరావు తన ఆశ్వీరచనాలు అందజేశారు. ఎవరైనా విమర్శిస్తే దాన్ని సవాలుగా స్వీకరించు. అంతేగానీ దాన్ని తలచి కుంగిపోకు అంటూ అక్కినేని తన మనవడికి...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 6:24 am

సెహ్వాగ్ సెంచరీః చెన్నైలో ప్రోటీస్‌కు భారత్ గట్టి జవాబు

దక్షిణాఫ్రికా బౌలర్లను చీల్చి చెండాడిన వీరేంద్ర సెహ్వాగ్ సెంచరీ చేయడం ద్వారా చెన్నై టెస్టులో భారత్ గట్టి జవాబు ఇచ్చే దిశగా పయనిస్తోంది. తాజా వార్తల ప్రకారం భారత్ వికెట్టు నష్టపోకుండా 166 పరుగులు చేసింది.
Source: Yahoo! Telugu: News | 28 Mar 2008 | 6:01 am

అంతర్గత ప్రజాస్వామ్యం లోపించింది: రాహుల్

ప్రస్తుత రాజకీయాల్లో అతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా లోపించిందని కాంగ్రెస్ పార్టీ యువ ఎంపీ రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. ఐదు రోజుల కర్ణాటక రాష్ట్ర పర్యటనలో భాగంగా గురువారం మంగుళూరులో పర్యటించారు. ఈ సందర్భంగా కళాశాల....
Source: జాతీయ | 28 Mar 2008 | 5:18 am

ప్రత్యక్ష ఎన్నికల పోటీకి గుడ్‌బై: పవార్

ఇకపై ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయబోనని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి, బీసీసీఐ అధ్యక్షుడు, మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ ప్రకటించారు. అయితే పెద్దల సభ (రాజ్యసభ)కు పోటీ చేసే విషయాన్ని ఆయన కొట్టి పారేయలేదు. తన సొంత....
Source: జాతీయ | 28 Mar 2008 | 5:07 am

కలసి ఉంటే కలదు సుఖం: ధర్మపురి

కాంగ్రెస్ పార్టీలోని నేతలంతా ఐకమత్యంగా ఉంటే భవిష్యత్ మనదేనని పిసిసి కొత్త సారథి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్) అభిప్రాయపడ్డారు. ఆయన పిసిసి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడారు. గత 2004 నాటి పరిస్థితులు మళ్లీ పునరావృత్తం...
Source: ఏపీ న్యూస్ | 28 Mar 2008 | 4:55 am

మూడో కూటమి ఎన్నికల స్టంట్: బర్ధన్

కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకు ప్రత్యామ్నాయంగా కొన్ని పార్టీలు ఏర్పాటు చేసిన తృతీయ కూటమి కేవలం ఎన్నికల స్టంట్‌లాంటిందని సీపీఐ అభివర్ణించింది. వామపక్షాల నేతృత్వంలో ఏర్పడే కూటమే ఆ రెండు పార్టీలకు అసలు సిసలైన ప్రత్యామ్నాయమని...
Source: జాతీయ | 28 Mar 2008 | 4:41 am

ఘనంగా "చిరుత" పుట్టిన రోజు వేడుకలు

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ 24వ పుట్టిన రోజు వేడుకలు రాజస్థాన్‌లో ఘనంగా జరిగాయి. తాను నటిస్తున్న రెండో చిత్రం షూటింగ్ రాజస్థాన్‌లో జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ చిత్రం షూటింగ్‌లోనే చిరుత పుట్టిన రోజు వేడుకలను చిత్ర...
Source: వినోదం | 28 Mar 2008 | 4:21 am

మార్చి 28, 2008 కార్యక్రమాలు

ఈ టీవీ భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా...
Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 3:09 am

మీ రోజు


Source: Yahoo! Telugu: Entertainment | 28 Mar 2008 | 3:04 am
Disclaimer | About

World : News Archives | Business | Entertainment | Sports | Technology | Science | Marketplace Audio
India : News | Business | Entertainment | Sports | Telugu |
Blogs : Humor pages | Norkay's Blog | Kids Stories | Indian Recipes | Database Tech Blog
Sundries : World Video Clips | Songs Clips | Indian Video Clips |