ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) బిడ్డింగ్ ప్రక్రియకు దూరంగా ఉండడంపై బీసీసీఐ అధ్యక్షుడు శరద్ పవార్ మాట్లాడుతూ ప్రతి విషయంలో తాను జోక్యం చేసుకోవాలని ఏమీ లేదని, అందువలనే దీనికి దూరంగా ఉన్నానని చెప్పారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 11:17 am
సీపీఎం పొలిట్‌బ్యూరో నుంచి వైదలగాలని తాను కోరుకుంటున్నట్లు పార్టీ వృద్ధ నేత జ్యోతి బసు శుక్రవారం చెప్పారు. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా తాను పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకోవాలనుకుంటున్నానని బసు చెప్పారు. వచ్చే నెలలో జరగబోతున్న Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 10:34 am
రానున్న ఒలింపిక్ కోసం చైనా అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. ఇందుకోసం బీజింగ్ ఎయిర్ పోర్టులో భారీ భద్రతా చర్యలను చేపట్టింది. ఈ ఎయిర్‌పోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అత్యంత ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోంది. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 10:15 am
మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు మచిలీపట్నంలో మదర్ థెరిస్సా విగ్రహాన్ని శుక్రవారం ఆవిష్కరించారు. అనంతరం అక్కడ చిరంజీవి అభిమానుల సంఘాలు ఏర్పాటు చేసిన రక్తదాన, నేత్రదాన శిబిరాలను ప్రారంభించారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 10:08 am
కిడ్నీ రాకెట్ సూత్రధారి డాక్టర్ అమిత్‌కుమార్‌ను మార్చి ఏడు వరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ శుక్రవారం కోర్టు తీర్పునిచ్చింది. సీబీఐ కస్టడీలో ఉన్న అమిత్‌మను సీబీఐ కోర్టుముందు హాజరుపర్చగా కోర్టు ఈ మేరకు ఆదేశించింది. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 9:52 am
పంతాల విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ కొంత దిగి వచ్చినందున తామూ ఓ మెట్టు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి ఎం. సత్యనారాయణ పేర్కొన్నారు. అయినప్పటికీ తెలంగాణా ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ గట్టెక్కడం కష్టమని అభిప్రాయపడ్డారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 9:33 am
సూపర్‌స్టార్ కృష్ణ ప్రధాన పాత్రలో నిషా కొఠారీ, శేఖర్ జంటగా నటిస్తున్న హరి ఓం చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రశాంత్ గౌడ్, వర్మలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రమణ్‌లోక్ దర్శకత్వం వహిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2008 | 9:18 am
చంద్రబాబు మేడారం జాతర రద్దుకు సీఎంతో ముడిపెట్టడం సరిగ్గాలేదని ఆర్థిక మంత్రి రోశయ్య దుయ్యబట్టారు. చంద్రబాబును మేడారం రాకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని టీడీపీ సభ్యులు చేసిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 9:14 am
అల్ రిసాలా చిత్రం నిషేధం కోసం శాసనసభలో ఎంఐఎం శుక్రవారం డిమాండ్ చేసింది. ముస్లింల మనోభావాలు దెబ్బతీసేలా ఈ చిత్రం ఉందని ఆ పార్టీ శాసనసభాపక్షం నేత అక్బరుద్ధీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 9:04 am
త్రిపుర అసెంబ్లీకి శనివారం జరగనున్న ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సర్వం సిద్ధం చేశారు. పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. భద్రతా చర్యల్లో భాగంగా కేంద్ర బలగాలను కూడా మోహరించారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 8:55 am
జమ్మూ- కాశ్మీర్‌లో మంచు చరియలు పడి నష్టం వాటిల్లిన ప్రదేశాల సందర్శనార్ధం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ శుక్రవారం ఉదమ్‌పూర్‌కు చేరుకున్నారు.
ఈ పర్యటనలో భాగంగా ఆమె మంచు వల్ల దెబ్బతిన్న పరిసరాలను సంధర్శించనున్నారు. Source: Yahoo! Telugu: News | 22 Feb 2008 | 8:54 am
శ్రీనగర్‌లో దిగువ కోర్టు ఆవరణలో భారీ బాంబు పేలుడు సంభవించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ వ్యక్తి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
భవంతిలోని ఓ గదిలో ఈ పేలుడు... Source: జాతీయ | 22 Feb 2008 | 8:21 am
విజ్ఞానాన్ని పంచే సైన్స్ ఎక్స్‌ప్రెస్ విజయవాడలో విద్యార్ధులను విశేషంగా ఆకర్షిస్తోంది. 12 బోగీలున్న ఈ రైలులో శాస్త్ర సాంకేతిక అంశాలను పొందుపరిచారు. ఫిజికల్ సైన్స్ కెమిస్ట్రీ ప్రయోగశాలలు కూడా ఏర్పాటుచేశారు. దీనిలో వివిధ పాఠశాలల సైన్స్ విద్యార్ధులు... Source: ఏపీ న్యూస్ | 22 Feb 2008 | 8:06 am
జమ్మూకాశ్మీర్ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఉగ్రవాదులు దాడి చేసే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం చేరడంతో కేంద్ర భద్రతా వర్గాలు అప్రమత్తమయ్యాయని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అలాగే ఆమె పర్యటించే... Source: జాతీయ | 22 Feb 2008 | 7:31 am
తెలుగు భాష ఔన్నత్యాన్ని పెంపొందిచాలని రాష్ట్ర ఆర్ధికమంత్రి కె రోశయ్య వ్యాఖ్యానించారు. ప్రవాసాంధ్రులు మాతృభాషకు పట్టం కడుతుంటే ఇక్కడ ఉన్నవారు మాత్రం పరభాషా మోజులో పడి స్వంత భాషను విస్మరిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు... Source: ఏపీ న్యూస్ | 22 Feb 2008 | 6:57 am
రాజా, స్నేహ హీరో, హీరోయిన్లుగా నటుడు గిరిబాబు దర్శకత్వం వహిస్తూ స్వంతంగా నిర్మించిన నీ సుఖమే నే కోరుతున్నా చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. రణభేరి ఆర్ట్స్, త్రీకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై ఈ చిత్రం నిర్మించబడింది. Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2008 | 6:45 am
సాయికుమార్ హీరోగా, వైభవి హీరోయిన్‌గా నటిస్తున్న కొత్త చిత్రం సిటిజన్ చిత్రం షూటింగ్ గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. సాయిప్రకాష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సి.వి.రోడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2008 | 6:20 am
రాష్ట్రంలో నిర్వహించనున్న గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల దరఖాస్తుల స్వీకరణ గడువును పొడిగిస్తున్నట్టు ఏపీపీఎస్సీ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది.... Source: ఏపీ న్యూస్ | 22 Feb 2008 | 4:58 am
ఈ టీవీ
భారత కాలమానం ప్రకారం ఉదయం 05.30 గంటలకు భక్తిగీతాలు, 06.00 గంటలకు ఆరాధన, 06.30 గంటలకు అన్నదాత, 07.00 గంటలకు ఈ టీవి న్యూస్, 07.30 గంటలకు ప్రియమైన నీకు, 08.00 గంటలకు టాలివుడ్ టైమ్, 09.00 గంటలకు ఈనాడు సినిమా... Source: Yahoo! Telugu: Entertainment | 22 Feb 2008 | 3:36 am
ఛండీగర్‌లోని గవర్నర్ నివాసానికి సమీపంలో ఓ మహిళపై ఇద్దరు హర్యానా ఆర్మీ పోలీసులు, ఓ కమాండర్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమె తన పని ముగించుకుని ఆటోలో తిరిగి వస్తుండగా... సదరు పోలీసులు ఆటోను.... Source: జాతీయ | 21 Feb 2008 | 3:35 pm
కాశ్మీర్‌లో గురువారం ఉదయం నుంచి మంచు భారీ స్థాయిలో కురుస్తుండటంతో సుమారు 15 మంది మృతి చెందగా.. 50 మంది తీవ్రంగా గాయపడినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. అలాగే సుమారు 650కి పైగా ఇళ్లు దెబ్బతిన్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి... Source: జాతీయ | 21 Feb 2008 | 3:35 pm
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌తో కలిసి సంయుక్తంగా ఫిబ్రవరి 23 నుంచి సైకాలజీపై శిక్షణ తరగతులను నిర్వహించనున్నారు. ఈ విషయమై సెంటర్ ఫర్ హెల్త్ సైకాలజీ సమన్వయకర్త డాక్టర్ మీనా హరిహరణ్ మాట్లాడుతూ.... Source: ఏపీ న్యూస్ | 21 Feb 2008 | 3:35 pm
సాహితీ రంగంలో విశిష్టసేవలందించిన 24 మంది ప్రముఖ రచయితలకు బుధవారం సాహిత్య అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. సాహిత్య అకాడమీ ఆడిటోరియం ఆధ్వర్యంలో... అకాడమీ 2007 ఎగ్జిబిషన్ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన... Source: జాతీయ | 21 Feb 2008 | 3:33 pm
జైపూర్‌లోని జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు బీజేపీ కార్యకర్తలు మృతి చెందగా, 22 మంది గాయాలపాలయ్యారు. వీరందరూ ఢిల్లీలో జరిగిన పార్టీ ర్యాలీలో పాల్గొని బస్సులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు.... Source: జాతీయ | 21 Feb 2008 | 3:33 pm
ప్రత్యేక తెలంగాణా రాష్ట్రంపై కేంద్రప్రభుత్వం నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాతే తమ నిర్ణయాన్ని వెల్లడిచేస్తామని రాష్ట్రహోం శాఖ మంత్రి కె జానారెడ్డి వ్యాఖ్యానించారు. క్లిష్టమైన ఈ అంశంపై జాతీయస్థాయిలో సమీక్ష జరిపి కేంద్రమే ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన... Source: ఏపీ న్యూస్ | 21 Feb 2008 | 3:32 pm